TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూటుమార్చిన స్టువర్టుపురం దొంగలు

Published on: Tue Sep 4, 2012 4:17PM

దొంగతనాల్లో ఆరితేరిన దొంగలు ఎక్కడ ఉంటారు అని ప్రశ్నిస్తే రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా చూసేది స్టువర్టుపురంవైపే. ఈ స్టువర్టుపురం దొంగలు దారిదోపిడీల్లోనూ, ఇళ్లలో దోచుకోవడంలోనూ ఆరితేరారు. అలానే రాష్ట్రం మొత్తం భయపడే తెలకపాముల జాతికి కూడా ఈ స్టువర్టుపురమే కేంద్రం. తెలకపాముల వారి దొంగతనాలు పాత రోజుల నుంచి ఇప్పటికీ కథలుకథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. దొంగతనాలు చేయటానికి అమావాస్య మంచి శకునమని నమ్మే ఈ జాతి దొంగలు ముందు తూర్పుదిశగా బయలుదేరి ఆ తరువాత తమ లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాలకు వెడుతుంటారు.


 

 అక్కడ కొన్ని రోజులు మకాం చేసి పెద్దపెద్ద ఇళ్లల్లో దొంగతనాలు చేసేందుకు ప్లాన్ సిద్ధంచేసుకుంటారు. మధ్యలో ఎదురయ్యే ఆటంకాలు అంచనా వేసుకుంటారు. కోళ్లు, మేకలు అమ్మేవాళ్లలా ఆ ఇళ్లలోకెళ్లి అదను చూసుకుని, ఆధారాలు దొరక్కుండా దొంగతనాలు చేశాక నేరుగా స్టూవర్ట్ పురానికెళ్లకుండా కొన్నాళ్లు ఇతరప్రాంతాల్లో గడపుతూ జల్సా చేసుకుంటారు. వీళ్లలో కొందరికి దారిదోపిడీలో అందెవేసిన చేయి. నెల్లూరు జిల్లాలో తెలకపాములవాళ్లు దారిదోపిడీలు చేస్తున్నారన్న వార్త రాష్ట్రంమొత్తం పాకిపోయింది. నెల్లురు మాగుంట లేఅవుట్ లో జరిగిన భారీ దొంగతనం ఆధారాల్నిబట్టిచూస్తే పూర్తిగా స్టూవర్ట్ పురం దొంగలపనేనని పోలీసులు చెబుతున్నారు.