TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాగుబోతు తండ్రికోసం కొడుకు ఆత్మహత్య

Published on: Fri Aug 31, 2012 5:30PM

ఖజానాని నింపుకోవడానికి సర్కారు సారాయి దుకాణాల్ని పెంచిపోషిస్తోంది. జనం బాగోగులు పట్టించుకోకుండా లిక్కర్ మీద సొమ్ముచేసుకోవడానికున్న దారులన్నింటినీ ఉపయోగించుకుంటోంది. కానీ.. దీనివల్ల చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయి. తాగుడుకు బానిసైపోయిన తండ్రి ఇక మారడన్న దిగులుతో ఓ కొడుకు ప్రాణం తీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. వేములవాడలో తండ్రి తాగుడు మానడంలేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూయిసైడ్ నోట్ లో తన చావుకి గల కారణాన్ని స్పష్టంగారాసి చచ్చిపోయాడు. ‘అమ్మా.. నన్ను క్షమించు.. నాన్న ఇక మందు మానడని భావించి నేను వెళ్ళిపోతున్నాను. నా చావుతోనైనా నాన్న మారతాడని ఆశిస్తున్నానని’ రాశాడు.