TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోరిక తీర్చలేదని అబ్బాయిని పొడిచిన అమ్మాయి

Published on: Thu Aug 30, 2012 4:08PM

లండన్ లో ఓ మహిళ తన కోరిక తీర్చాలేదని కోపం వచ్చి ట్యాక్సీ డ్రైవర్ ని పన్నెండు చోట్ల పొడిచింది. దీంతో లుమినిటా పెరిజోక్ (30) అనే ఆ మహిళపై రొమేనియన్ టాక్సీ డ్రైవర్ నికోల్ స్టాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెరిజోక్  ట్యాక్సీ దిగిన తర్వాత లాగేజ్ ఎక్కువగా ఉందని డ్రైవర్ నికోల్ ను అపార్ట్‌మెంట్ వరకు తీసుకురమ్మని కోరింది. అతను లాగేజ్ తీసుకొని లోపలి వెళ్ళిన తరువాత శృంగారానికి రమ్మంటే తాను నిరాకరించగా కత్తి చూపించి బట్టలు విప్పమని చెప్పింది. ఎలాగోలా బెడ్‌రూంలోకి దూరిన అతను పోలీసులకు ఫోన్ చేసి వారి సాయంతో బయటపడినట్లు చెప్పాడు. అతడిని ఆస్పత్రికి తెసుకొని వెళ్లగా పన్నెండు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కానీ కత్తి చూపించి బెదిరిస్తే మిస్ రొమేనియా వచ్చినా శృంగారం చేయడం అసాధ్యమని స్టాన్ అంటున్నాడు.