కొత్తవిత్తన చట్టం ప్రభుత్వానికి మంత్రదండమా?
Published on: Tue Sep 4, 2012 4:55PM
రాష్ట్రంలో కొత్తవిత్తన చట్టాన్ని అమలు చేయబోతున్నామని ప్రకటించిన వ్యవసాయశాఖా రాష్ట్రమంత్రి కన్నాలక్ష్మినారాయణ మాయలు మంత్రాలు చేయబోతున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి పూర్తి వివరాలు చెప్పకుండా మంత్రి ఈ ప్రకటన చేయటం రైతులకు తీరని అసహనాన్ని కలిగిస్తోంది. అసలు కేంద్రానికి రాష్ట్రప్రభుత్వం ఏ ప్రతిపాదనలు పంపించింది? వాటిలో ఏవి అమలు చేయబోతున్నారు? కేంద్రం ఆమోదించిన కొత్తవిత్తన చట్టంలో రాష్ట్రం సూచించిన 17సవరణలేంటి? అవి నిజంగా రాష్ట్రరైతులకు ఉపయోగపడతాయా? లాంటి సందేహాలు మంత్రి ప్రకటన తరువాత రైతులకు బాగా పెరిగిపోయాయ్. రాష్ట్రంలో విత్తన చట్టం అమలు చేసేందుకు మంత్రి ఏర్పాటు చేసే కమిటీలో అసలు రైతుల పాత్ర కానీ, రైతు సంఘాల నాయకుల పాత్ర కానీ ఉంటుందా అన్న కొత్త అనుమానం కూడా బయలుదేరింది. రైతులు కాని వారికి అధికారం అప్పగించి వ్యవసాయరంగ నష్టాలకు ప్రభుత్వమే కారణమవుతోందని తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ కి ప్రభుత్వ విధానాలే కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


