TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇన్‌పుట్‌సబ్సిడీలపై కఠిననిబంధనలు అవసరమా?

Published on: Sat Aug 11, 2012 10:32AM

రైతులకు సరఫరా చేయాల్సిన ఇన్‌పుట్‌సబ్సిడీ సక్రమంగా రైతులకు అందజేసేందుకు కఠినతరమైన నిబంథనలు అవసరమని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సబ్సిడీ నేరుగా రైతులను చేరటం లేదు. ప్రత్యేకించి జిల్లా యంత్రాంగాల్లో ఉన్న అలసత్వం, బ్యాంకర్ల నిర్లక్ష్యం వెరసి రైతులకు సీజన్‌ పూర్తయ్యాక కూడా అందని పరిస్థితులను కల్పిస్తోంది. రాష్ట్రంలోని కడప, అనంతపురం, తెలంగాణా జిల్లాల్లోని కరువు ప్రాంత రైతులను ఒకవైపు అథికారులు, మరోవైపు బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు. జీరో బ్యాలెన్స్‌ అకౌంట్‌ అవసరం లేని వారికి మంజూరు చేసే బ్యాంకులు రైతుల విషయంలో రిక్తహస్తాలు చూపుతున్నాయి.


 

పైగా మినిమమ్‌ సేవింగ్స్‌ అకౌంటు పరిథిపెంచి మరీ రైతులకు బ్యాంకులు అంటగడుతున్నాయి. దీంతో కర్షకుని కష్టం తీరటం లేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. అనంతపురంలో జిల్లాకలెక్టర్‌ వి.దుర్గాదాస్‌ ఎన్నిసార్లు బ్యాంకర్లను కోరినా వారు పెద్దగా స్పందించటం లేదు. అకౌంట్‌ యాక్టివేట్‌ కావటం లేదనే సాకుతోనూ రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీని ఆలస్యం చేస్తున్నారు. నల్గొండజిల్లాలో 59మండలాల్లో కరువును కేంద్రప్రభుత్వం గుర్తించింది. 117 గ్రామపంచాయతీల్లో పంటనష్టం సంభవించిందని కలెక్టర్‌ ముక్తేశ్వరరావు స్వయంగా పరిశీలించి నిర్ధారణకు వచ్చారు.



అందుకే ఇన్‌పుట్‌సబ్సిడీగా రూ.129.4కోట్లను ఆయన శాంక్షన్‌ చేయించగలిగారు. రైతులకు మాత్రం ఆయన చేరవేయలేకపోయారు. కారణం బ్యాంకర్ల సాకులే. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఇన్‌పుట్‌ సబ్సిడీపై కఠిన నిబంధనలు రూపొందించకపోతే రైతులకు ఇవి అందేటప్పటికి ఏళ్లుగడిచిపోతాయన్నది అనంతపురం జిల్లా అనుభవంగా గుర్తించాలి. నల్గొండ జిల్లా కూడా తాజాగా ఇదే అనుభవాన్ని చవిచూస్తోంది.