TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్లోబల్ ఎకానమీలో ఇండియా టాప్: భారత్ వృద్ధి రేటి అంచనాలు పెంచిన ఐఎంఎఫ్.!

Published on: Wed Nov 18, 2026 2:04PM

ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా మరో  హిస్టారికల్ మైల్ స్టోన్ దాటింది. గ్లోబల్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా నివేదికలలో భారత్ అమెరికా, చైనాలను తోసి రాజని కొత్త రికార్డ్ సృష్టించింది. గ్లోబల్ ఎకానమీలో    అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.

కీలకమైన ఆర్థిక సూచీల పరంగా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా వాస్తవ జీడీపీ వృద్ధి రేటు (రియల్ జీడీపీ గ్రోత్), తలసరి జీడీపీ వృద్ధి, అలాగే  గ్రాస్ సేవింగ్స్ విభాగాలలోఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఎదిగింది.  గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్,  ఎగుమతుల వృద్ధిలో రెండో స్థానంలో నిలిచింది.   డెట్-టు-జీడీపీ నిష్పత్తిలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఇదే సమయంలో  చైనా 66 స్కోరుతో రెండో స్థానంలోనూ,   జపాన్ మరియు రష్యా 60 స్కోరుతో సంయుక్తంగా మూడో స్థానంలోనూ నిలిచాయి,  ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు  నిలిచాయి.  అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా   36 స్కోరుతో ఈ జాబితాలో అట్టడుగు స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.  

దేశ ఆర్థిక వ్యవస్థ   పటిష్టమైన స్థూల ఆర్థిక మూలాలపై ఆధారపడి ఉందని ఆర్బీఐ గతంలోనే స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న   విధానపరమైన నిర్ణయాలు, సకాలంలో అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు  అంతర్జాతీయ సవాళ్ల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదికూడా చదవండి: భారత జిడిపి వృద్ధి 8% దాటేదే కానీ: ఆర్‌బిఐ సంచలన ప్రకటన!​

మరోవైపు   వాణిజ్య రంగంలోనూ ఇండియా పురోగతి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి అర్ధభాగంలో వాణిజ్య ఎగుమతులు రెండంకెల వృద్ధిని నమోదు చేయడంతో దేశ వాణిజ్య లోటు భారీగా తగ్గింది. అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు  , ఈసీబీలు, విదేశీ రెమిటెన్స్ లూ కూడా  పుంజుకున్నాయి. ఈ సానుకూల పరిణామాలను పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి  భారత వృద్ధి రేటు అంచనాను మరో 60 బేసిస్ పాయింట్లు పెంచి 7 శాతానికి సవరించింది.

రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న తరుణంలో, ఇండియ స్థిరమైన వృద్ధిని కనబరచడం అంతర్జాతీయ వేదికపై దేశ ఆర్థిక శక్తికి నిదర్శనంగా నిలుస్తోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

మీకు నచ్చవచ్చు:   గ్లోబల్ ఎకానమీ వృద్ది అంచనాలు: అగ్రస్థానంలో ఇండియా.!​
భారత పరిశ్రమల సంచలనం: ఆగస్టులో 8 శాతానికి చేరిన పారిశ్రామిక వృద్ధి!​

[Iindia GlobalEconomy,  Record, China,  USA, , IMF India, Growth Rate, TeluguOne]