TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీకి ఉప్పెన ముప్పు.. తీర ప్రాంత గ్రామల నుంచి జనం తరలింపు.!

Published on: Tue Nov 3, 2026 4:25AM

రాష్ట్రంలో మురసు తుపాను కారణంగా ఉప్పెన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.   సముద్రంలో తుపాను తీవ్రత కారణంగా ఉప్పెన   ముప్పు పొంచి ఉన్నందున, సముద్ర తీరప్రాంత ఆవాసాలు, ముప్పు ఉన్న  గ్రామాల ఉన్న ప్రజలను   సురక్షిత ప్రాంతాలకు తరలించింది.   క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారులు,  తహశీల్దార్లు ఈ తరలింపు ప్రక్రియను యుద్దప్రాతిపదికన చేపట్టారు. 

సముద్రం ఉగ్రరూపం దాల్చి ఉప్పెన ముంచెత్తే ప్రమాదం ఉన్న   ప్రభావిత ప్రాంతాలను జిల్లా యంత్రాంగం గుర్తించింది. నిజాంపట్నం మండలంలోని దర్వేశ్‌పాలెం, ఎక్స్‌ మిలిటరీ కాలనీ, పామర్తివారిపాలెం, అడవులదీవి, జంపనివారిపాలెం, సంజీవనగర్, కొత్తపాలెం గ్రామాలతో పాటు బాపట్ల మండలంలోని అడవిపల్లెపాలెం, సూర్యలంక తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 

ఇంకా  చీరాల మండల పరిధిలోని వాడరేవు, విజయలక్ష్మీపురం, వేటపాలెం మండలంలోని రామాపురం గ్రామాలను ముప్పు  ప్రాంతాలుగా గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అదే విధంగా  చినగంజాం మండలంలో  రుద్రాంభపురం, నిరీక్షణగిరి, పెద్దపల్లెపాలెం, పల్లెపాలెం, ఏటిమొగ, కట్టంవారిపాలెం, కోడూరివారిపాలెం   ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.  తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఎటువంటి లోటు పాట్లూ లేకుండా  సౌకర్యాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  

[Cyclone Murasu Effect, Storm Surge Alert, Murasu Cyclone Evacuation, Nizampatnam, Chirala Relief Centres, Telugu One]