హైకోర్టులో పిటిషన్ వేసిన అక్బరుద్దీన్.. నాపై రాజకీయ కుట్ర..!

  మొగుడ్ని చితకబాది వీధికెక్కి ఏడ్చిన గడుసు ఇల్లాలులాగ, ప్రశాంతంగా ఉన్న ప్రజలమద్య మద్యన మతచిచ్చురగిలించిన అక్బరుద్దీన్ ఓవైసి, తప్పని పరిస్థితుల్లో నేడు లండన్ నుండి హైదరాబాదు తిరిగివచ్చినప్పటికీ, ఆరోగ్యం బాగోలేదనే సాకుతో పోలీసులకి లొంగిపోకుండా, తన న్యాయవాదులు మహ్మద్ ఇస్మాయిల్, రసూల్ ఖాన్ లను నిర్మల్ పంపించి తనకు నాలుగు రోజుల గడువు కావాలని కోరాడు. నాలుగు రోజుల తరువాత, పోలీసులు ఎప్పుడు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తానన్న పెద్ద మనిషి, అతితెలివి ప్రదర్శిస్తూ హైకోర్టులో ఒక పిటిషను కూడా వేసేడు. దానిలో, తన ప్రసంగంలో కొంత భాగాన్నేసరిగా ఎడిటింగ్ చేయకుండా ఎవరో యూ-ట్యూబ్ లో పెట్టేరని, మీడియా ఒత్తిడి వల్లే తనపై పోలీసులు కేసులు వేసేరని, ఒకే కారణంతో ఒక వ్యక్తిపై పలుచోట్ల కేసులు వేయడం రాజకీయ కుట్రలోభాగమేనని, తన రాజకీయ ప్రత్యర్ధులు తనపై దురుదేశంతోనే ఈ విదంగా కుట్ర పన్నారని, అందువల్ల తనపై నమోదయిన కేసులలో పోలీసులు తదుపరి చర్యలు చెప్పట్టకుండా వారిని ఆదేశించాలని కోరాడు.

లొంగిపోని అక్బరుద్దీన్ ఓవైసి, నాలుగు రోజులు రెస్ట్..!

        కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జరిగిన ఒక భారిబహిరంగసభలో హిందూ దేవతలను కించపరుస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన యంఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసికి వ్యతిరేఖంగా సర్వత్ర నిరసనలు వెల్లువెత్తడంతో, రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలుచోట్ల కూడా అతనిపై పోలీసు కేసులు నమోదు చేశారు. అక్బరుద్దీన్ తన సభలోప్రజలపై విషం చిమ్మిన తరువాత, మరి ముందే ఈ సమస్యని ఊహించినందువల్లనో మరి వేరే ఇతర కారణాలతోనో వెంటనే లండన్ వెళ్ళిపోయాడు.   ఈ రోజు తెల్లవారుజామున అక్బరుదీన్ లండన్ నుండి హైదరాబాదు తిరిగి వచ్చేశారు. అతనికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా శంషాబాద్ విమానాశ్రయానికి తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తరువాత పెద్ద ఊరేగింపుగా తన ఇంటికి బయలుదేరి వెళ్ళారు. ఈ రోజు అక్బరుద్దీన్ అదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా అక్బర్ హాజరు కావట్లేదని మజ్లిస్ చెబుతోంది. అక్బరుద్దీన్ తరఫున ఆయనకు చెందిన ఇద్దరు న్యాయవాదులు ఇస్మాయిల్, రసూల్ ఖాన్ నిర్మల్ పోలీసు స్టేషన్ ఎదుట హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా అక్బరు పోలీసు స్టేషన్‌కు ఈ రోజు హాజరు కాలేదని, నాలుగు రోజులు సమయం ఇవ్వాలని వారు పోలీసులను కోరారు. అతను నిర్మల్ పోలీసు స్టేషన్లో లొంగిపోతాడని ఉహించిన పోలీసులు పట్టణంలో సెక్షన్ 144 క్రింద కర్ఫ్యూ విదించారు ఒక సామాన్యుడిని క్షణాలమీద లాకప్ లో పడేయగల పోలీసులు, ఇటువంటి బడానేతలను మాత్రం ఏమిచేయలేక చేతులు ముడుచుకొని కూర్చోవలసి వస్తోందంటే అందుకు మన ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు, మతపరమయిన అల్లర్లు చెలరేగుతాయనే భయంతో పోలీసులు అతనిని ఉపేక్షంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటువంటి కేసులు చట్టం దృష్టిలో కొందరు ‘అధిక సమానం’ అని నిరూపిస్తుంటాయి.  

రాష్ట్ర కాంగ్రెస్ లో పెరుగుతున్న ‘టి’ గ్యాప్’

      అంతా అనుకున్నట్లు జరిగితే, మరో 20 రోజుల్లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఫై కేంద్రం ఓ ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ప్రకటన తమకు అనుకూలంగా వచ్చేలా చూసేందుకు తెలంగాణా, సీమంధ్రా ప్రాంత నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. కేంద్రంఫై వత్తిడి తెచ్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.   ఇరు ప్రాంతాల నేతలు తమకు అనుకూల ప్రకటనలు చేయడంలో మునిగిపోయారు. తాజాగా తెలంగాణా రాష్ట్రం ఇస్తే, తాను తన పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు కృష్ణా రెడ్డి ప్రకటించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం సీమంధ్రా ప్రాంత పారిశ్రామిక వేత్తలు ఉద్యమాన్ని చులకన చేస్తున్నారని,అసలు ఉద్యమాన్నే కించపరుస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు పి.ప్రభాకర్ సీమంధ్రా ప్రాంత రాజకీయ నేతలఫై విరుచుకుపడ్డారు.   తనకు కేంద్ర మంత్రి పదవి దక్కలేదనే కోపంతో ఉన్న ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు ఆ కోపాన్ని తెలంగాణా నేతలఫై చూపిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరిట భారీ ఎత్తున డబ్బులు దండుకుంటున్నారని కావూరి ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అసలు తెలంగాణా ప్రజలు రాష్ట్ర విభజన కోరుకోవడం లేదని బాపట్ల శాసన సభ్యుడు గాదె వెంకట రెడ్డి అన్నారు.   ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం అంటూ ఏర్పడితే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజ్ గోపాల్ ప్రతిజ్ఞ చేశారు. ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రకటనలు చేస్తూ పోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య అంతరం రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

నిర్మల్ పోలీస్ స్టేషన్ కు అక్బరుద్దీన్, 144 సెక్షన్..?

  కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జరిగిన ఒక భారిబహిరంగసభలో హిందూ దేవతలను కించపరుస్తూ, ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేసిన యంఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసికి వ్యతిరేఖంగా సర్వత్ర నిరసనలు వెల్లువెత్తడంతో, ఇటువంటి విషయాలలో మొట్ట మొదట స్పందిచాల్సిన ముఖ్యమంత్రి తాపీగా, మొక్కుబడిగా స్పందిస్తూ ‘చట్టం తన పని తానూ చేసుకుపోతుందని’ ఓమాట చెప్పి బాద్యతను పోలీసుల మీదకి నెట్టేశారు. అప్పుడు పోలీసులు, అతనిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.   రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పలుచోట్ల కూడా అతనిపై పోలీసు కేసులు నమోదు చేయబడ్డాయి. అయితే, అక్బరుద్దీన్ తన సభలోప్రజలపై విషం చిమ్మిన తరువాత, మరి ముందే ఈ సమస్యని ఊహించినందువల్లనో మరి వేరే ఇతర కారణాలతోనో వెంటనే లండన్ వెళ్ళిపోయాడు. సమన్లు అందించడానికి వెళ్ళిన పోలీసులకి అవి తీసుకొనే నాదుడు లేకపోవడంతో, ఆ నోటీసులని బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటిగోడకి అంటించి తిరుగుముఖం పట్టాల్సివచ్చింది.   అప్పటికీ ఇంకా ఆందోళనలు సాగుతూనే ఉండటంతో, డిజిపి. దినేష్ రెడ్డి మీడియావారితో మాట్లాడుతూ, అక్బరుద్దీన్ స్వయంగా వచ్చి లొంగిపోనట్లయితే, తాము ఇంటర్పోల్ పోలీసుల సహకారం తీసుకునయినా అతనిని దేశానికి రప్పిస్తామని చెప్పడంతో, అక్బర్ నుంచి స్పందన కనిపించింది. తానూ సోమవారం నాడు హైదరాబాదు తిరిగివచ్చి పోలీసుల ముందు లొంగిపోనునట్లు తెలియజేసాడు.   ఈ రోజు, అంటే సోమవారం తెల్లవారుజామున అక్బరుదీన్ లండన్ నుండి హైదరాబాదు తిరిగి వచ్చేడు. అతనికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున యం.ఐ.యం. పార్టీ శాసన సభ్యులు, పార్టీ కార్యకర్తలు కూడా శంషాబాద్ విమానాశ్రయానికి తరలి రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తరువాత పెద్ద ఊరేగింపుగా తన ఇంటికి బయలుదేరిన అక్బరుద్దీన్, మరి కొద్ది సేపటిలో తన పార్టీ శాసన సభ్యులు, కార్యకర్తలను వెంటపెట్టుకొని భారీ ఊరేగింపుతో నిర్మల్ బయలుదేరుతున్నట్లు సమాచారం.   అతను నిర్మల్ పోలీసు స్టేషన్లో లొంగిపోయేందుకు కాక, అంతమందిని వెంటేసుకొని దండయాత్రకి బయలుదేరినట్లుగా బయలుదేరడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. వారు సరిపోరనట్లు, స్థానికంగా ఉన్న యంఐ.యం.పార్టీ నేతలు, పార్టీ కార్యకర్తలుకూడా అతనికి తోడవనున్నారు. ఈ పరిస్థితులను ముందే ఊహించిన నిర్మల్ పోలీసులు పట్టణంలో సెక్షన్ 144 క్రింద కర్ఫ్యూ విదించేరు. గానీ, దానిని అపహాస్యం చేయబోతూ అక్బరుద్దీన్ అతని అనుచరులు కూడా భారి ఎత్తున పోలీసు స్టేషన్ జేరుకోబోతున్నట్లు సమాచారం.   ఒక బాధ్యాతాయుతమయిన శాసనసభ్యుడిగా అక్బరుద్దీన్ ఇప్పటికికూడా తన మాటలకి పశ్చాతాపం ప్రకటించక, తను చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా ఏదో ఘనకార్యం చేసినట్లు ఊరేగింపుగా బయలుదేరడం సిగ్గుచేటు. అంతేగాకుండా, మళ్ళీ నిషేదాజ్ఞాలు ఉల్లగించి మరో తప్పు జేయడానికి ఇప్పుడు సిద్దం అవుతున్నాడు.   గత అనేక సం.లలో అతనిపై అనేక కేసులు నమోదు చేయబడినప్పటికీ, స్వేచ్చగా తన విష ప్రచారం కొనసాగిస్తూ, చట్టం తనని ఏమిచేయలేదని పలుమార్లు నిరూపించిన అక్బరుద్దీన్, ఇప్పుడు నమోదు చేయబడిన కేసులనుండి కూడా అంతే తేలికగా తప్పించుకోగలనని నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.   ఒక సామాన్యుడిని క్షణాలమీద లాకప్ లో పడేయగల పోలీసులు, ఇటువంటి బడానేతలను మాత్రం ఏమిచేయలేక చేతులు ముడుచుకొని కూర్చవలసి వస్తోందంటే అందుకు మన ఓటు బ్యాంకు రాజకీయాలే కారణం అని చెప్పక తప్పదు. ఇప్పుడు, మతపరమయిన అల్లర్లు చెలరేగుతాయనే భయంతో పోలీసులు అతనిని ఉపేక్షంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇటువంటి కేసులు చట్టం దృష్టిలో కొందరు ‘అదిక సమానం’ అని నిరూపిస్తుంటాయి. ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే, అక్బరుద్దీన్ మీద కేసులు నమోదు చేసిన నిర్మల్ పోలీసులవద్ద గానీ, మరే పోలీసు స్టేషన్ వద్ద గానీ, అక్బరుద్దీన్ చేసిన విద్వేష ప్రసంగం యొక్క విడియో సాక్ష్యాలు గానీ, అతని తప్పును నిరూపించే సాక్షులుగానీ లేరు. అందువల్ల, ప్రస్తుతం పోలీసులు వీడియో టేపుల కోసం మీడియా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు సమాచారం. అదే పనిలో, ఇంటర్నెట్ లో కూడా ‘యు ట్యూబ్’ వంటి వెబ్ సైట్లను కూడా వెతుకుతున్నారని వార్త.     

పరిటాల కుటుంబానికి సానుభూతి తెలిపిన జేసి సోదరులు!

  అనంతపురం జిల్లాలో రెండు బలమయిన రాజకీయ వర్గాలకు చెందిన పరిటాల, జేసి సోదరుల మద్య ఉన్నరాజకీయవైరాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పరిటాలరవి హత్య తరువాత అతని అర్దాంగి సునీత ఈ ముఠా కక్షలు, రాజకీయాల పట్ల నిరాసక్తత చూపడంతో క్రమంగా ఆ రెండు కుటుంబాల మద్య ఉన్న కక్షలు కూడా కనుమరగవుతూ వచ్చాయి.   వారం రోజుల క్రితం పరిటాల శ్రీరామ్ మీద పోలీసులు హత్యాప్రయత్నం కేసు నమోదు చేయడం, తదనంతర పరిణామాలను గమనిస్తున్న జేసి సోదరులు, మొన్న మొట్ట మొదటిసారిగా పెదవి విప్పేరు. జేసి దివాకర్ రెడ్డి సోదరుడయినా ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో మీడియా వారితో మాట్లాడుతూ పరిటాల కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేసారు.   “పరిటాల సునీతా భర్తను పోగ్గొట్టుకొని ఒంటరిగా పిల్లలని పెంచి పెద్ద చేసి మంచి చదువులు చెప్పిస్తోంది. ఆమె కష్టాలు ఆమెకున్నాయి. ఆమె కొడుకు శ్రీరామ్ కూడా ఇంకా చిన్న పిల్లవాడు. రాజకీయాలలోకి రావాలని అత్రపడుతున్నాడు. గానీ, అతనికి సరయిన వయసు అనుభవము రెండూ లేవు. అందువల్ల అతను ఆచితూచి అడుగేయడం మంచిదని నా అభిప్రాయం. మంచి భవిష్యత్ ఉన్న ఆ పిల్లాడి విషయంలో అందరూ కలిసి కూర్చొని ఏదోవిదంగా సమస్యని సర్దుబాటు చేసుకొంటే మంచిదని మా అభిప్రాయం” అని అన్నారు.   చాలాకాలం తరువాత జేసి సోదరుల నోటినుండి ఈవిదయిన సానుభూతి పలుకులు విన్న జిల్లా ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా స్వాగతించేరు. రెండు బలమయిన వర్గాలు జిల్లాలో శాంతి సామరస్యాలు కోరుకొంటే ప్రజలకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?

కెబిసిలో రూ.5కోట్లు గెల్చుకున్న మహిళ

      ముంబై గృహిణి సుర్మీత్‌ కౌర్‌ సౌనీ అత్యంత జనాదరణ పొందిన కౌన్‌బనేగా కరోడ్‌పతి షోలో జాక్‌పాట్‌ కొట్టేశారు. రూ. 5కోట్లు కైవసం గెలుచుకున్న రెండో పోటీదారుగా ఈమె చరిత్ర సృష్టించారు. బ్రిటన్‌కు చెందిన ‘హూ వాంట్స్‌ టు బి ఎ మిలియనీర్‌’ టీవీ షో ప్రేరణతో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రారంభించిన కౌన్‌బనేగా కరోడ్‌పతి దేశంలో అత్యధిక ప్రజానీకం చూస్తున్న టీవీ గేమ్‌ షోగా పేరొందింది. గతంలో బీహార్‌ నివాసి సుశీల్‌ కుమార్‌ ప్రప్రధమంగా ఈ పోటీల్లో అయిదు కోట్లు గెలిచిన వ్యక్తిగా వార్తల్లోకెక్కారు. నెలకు ఆరువేల రూపాయల వేతనంతో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సుశీల్‌ ఈ బంపర్‌ ప్రైజ్‌ను గెలుచుకోవడతంతో కోట్లమందికి కరోడ్‌పతిపై క్రేజీ పెరిగిపోయింది. ఈ షో వచ్చే వారం ప్రసారం కాబోతుంది. ఛండీగఢ్ కు చెందిన ఈ మహిళ ముంబయిలో స్థిరపడింది. ఆమె భర్త హిందీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

చంద్రబాబు పాదయాత్ర ప్రత్యక్ష్య ప్రసారం

      చంద్రబాబు పాదయాత్ర ఇక ప్రత్యక్ష్య ప్రసారం కాబోతుంది. చంద్రబాబు ప్రతి అడుగు ఇక ప్రత్యక్ష్యంగా ఆన్ లైన్ లో వీక్షించవచ్చు. వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న భారీ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. త్వరలో అది వందరోజులు కూడా పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్రను ఇంటర్‌నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్, గూగుల్ ప్లస్ హ్యాంగవుట్ వెబ్‌సైట్ల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది. చంద్రబాబు పాదయాత్ర ప్రజలను ఎంతో ఆకర్షిస్తుందని, ఆసక్తి ఉన్నవారు పాదయాత్ర లో ప్రత్యక్ష్యంగా పాల్గొనలేకపోయిన వారి కోసం ఈ పాదయాత్రను ప్రత్యక్ష్య ప్రసారం చేయడానికి ఏర్పాటు చేసినట్లు పార్టీ ఐటీ విభాగం అధిపతి టి. శ్రీనివాసరావు తెలిపారు. www.telugudesam.org వెబ్‌సైట్‌లో కూడా ఈ పాదయాత్రను ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు.

త్వరలో జగన్ కి బెయిలు మంజూరు అవబోతోందా?

  గత ఏడు నెలలుగా వివిధ కేసులలో చంచల్ గూడా జైలులో నిర్బంధించబడ్డ జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుడిలా కోర్టులో బెయిలు దరఖాస్తులు వేస్తూనే ఉన్నాడు. కోర్టులు వాటినన్నిటినీ కూడా తిరస్కరించినప్పటికీ, తనకి అన్యాయం జరుగుతోందనే సంగతిని మాత్రం కోర్టువారికి తెలియజేయగలిగేడు. ఇన్ని నెలలు జైలులో నిర్బందించినప్పటికీ, ఇంతవరకు కోర్టులు ఒక్క కేసులో కూడా విచారణ మొదలుపెట్టేందుకు, సిబి.ఐ. తగిన సమాచారంతో ముందుకు రాలేకపోయిందని, ఇంకా ఇప్పటికీ సమయం కోరుతోందని కోర్టువారికి జగన్ తరపున లాయర్లు విన్నవించుకోవడంతో, హైకోర్టు కూడా వారి వాదనలతో అంగీకరించి, జగన్ కేసుల విషయంలో సి.బి.ఐ. తన దర్యాప్తు ఎంతవరకు పురోగతి సాదించిందో తెలుపమని రిపోర్ట్ కోరింది. సిబిఐ తన రిపోర్టులను హైకోర్టుకి సమర్పిస్తూ, వివిధ కేసులకు సంబంధించి వివరాల కోసం తాము సచివాలయానికి వ్రాసిన లేఖలకి స్పందన కరువయిందని తెలుపుతూ, ప్రభుత్వం నుండి పూర్తీ సమాచారం పొందేందుకు మరో మూడు నెలలయినా పట్టవచ్చునని, అంతవరకూ జగన్ కు బెయిలు ఈయవద్దని కోర్టును కోరింది. అయితే, ఇప్పటికే ఏడూ నెలలు ఎటువంటి విచారణ లేకుండా జగన్ మోహన్ రెడ్డిని నిర్బందించడం అన్యాయం అని వాదిస్తున్న అతని లాయర్స్ వాదనతో కోర్టు గనుక అంగీకరిస్తే త్వరలో జగన్మోహన్ రెడ్డికి కోర్టు బెయిలు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. గానీ, కోర్టు, సిబిఐ వాదనతో అంగీకరించినట్లయితే మాత్రం జగన్ కి మరో మూడు నెలలు చెంచల్ గూడా నివాసం తప్పకపోవచ్చును.

జాతకాలు చెపుతున్న కామ్రేడ్లు

  రాష్ట్రంలో మిగిలిన మరే రాజకీయ పార్టీలకన్నాకూడా ఎక్కువగా ప్రజలతో మమేకమవుతూ, వారి పక్షాన్న నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటాలుచేసే కమ్యునిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు రెండూకూడా దశాబ్దాలు గడుస్తున్నా ఇంతవరకు రాష్ట్రంలో స్వయంగా గానీ, సంకీర్ణంగా గానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయాయి.   ఎన్ని పోరాటాలుచేసినా ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు తోకపార్టీలుగానే మిగిలిపోయాయి. అందుకు ఆపార్టీల రాష్ట్రనాయకత్వంలో లోపమా, లేక తమ పార్టీసిద్దాంతాలపట్ల ప్రజలలో నమ్మకం కల్గించలేకపోవడంవల్ల విఫలమవుతున్నారా? లేక ప్రదాన రాజకీయపార్టీల ప్రభావం ప్రజలమీద ఎక్కువగా ఉన్నందునే వెనుకబడిపోయారా? కారణాలు వారే తెలుపాలి.   రెండు పార్టీలుకూడా తాము జీవితాంతము ప్రధానరాజకీయ పార్టీలకు తోకపార్టీలుగానే ఉండిపోయేందుకు మానసికంగా సంసిద్దమయిపోయినట్లే కనిపిస్తోంది. విచారించవలసిన విషయం ఏమిటంటే, అలాగ మిగిలిపోయినందుకు ఆ రెండు పార్టీలు ఏనాడు చింతిస్తున్నట్లు గానీ, సిగ్గు పడుతున్నట్లు గానీ కనిపించకపోవడం. ప్రస్తుత అవి ఉన్న స్థాయిలోనే ఎన్నటికీ ఉండిపోవాలనుకొంటున్నాయే తప్ప, ఎందుకు ఇలాగ ఉండిపోయాము? ఎంతకాలం ఈవిదంగా ఉండిపోవాలి మనము? అని ఆలోచనలుచేసి, కొత్తగా చేసిన ప్రయత్నం ఏది లేదు.   ఒక సారి చేతులు కలుపుకొంటూ, మరోసారి తమ కొడవళ్ళు ఒకరిపై ఒకరు దూసుకొంటూ కాలక్షేపం చేసేస్తున్నాయి ఆ రెండు పార్టీలుకూడా.   ఇక విషయానికి వస్తే, మార్క్సిస్టు పార్టీ నాయకుడు బీవి రాఘవులు, తమ మిత్రపార్టీ సి.పి.ఐ. నాయకుడు నారాయణ తెలంగాణాపై నిత్యం చేస్తున్న ఊహాగానాలను గమనించి, ఆయననుద్దేశించి మాట్లాడుతూ కమ్యునిస్ట్ పార్టీ తమ ఆఫీసులో జాతకాలు చెప్పుకొనే దుకాణం కూడా తెరుచుకొంటే బాగుంటుంది అని చురకలు వేసారు. అయితే, దానిని సరదాగా తీసుకొన్న సి.పి.ఐ. నాయకుడు నారాయణ వెంటనే స్పందిస్తూ, “కమ్యునిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు రెండూ కూడా భవిష్యత్ సమాజం కోసం చేసిన ఆలోచనలోంచి పుట్టుకు వచ్చినవే. అందుకే రెండుకూడా ఎవరి జాతకం ఎలా ఉంటుందో చెపుతుంటాయి” అని జవాబిచ్చేరు.   గానీ కామ్రేడ్లు ఇద్దరూ ఎంతసేపు కూడా ఎదుటవారి ‘సైకిళ్ళు,’ ‘కార్లు’ ఎక్కుతూ వారి ‘హస్తరేఖల్లోనే’ తమ జాతకాలు చూసుకొవడం ఒక వింత.

మంత్రి రాంరెడ్డి కి శ్రీ చైతన్య స్కూల్ 35 లక్షల లంచం.. !

    రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డికి తమ స్కూల్ నిర్వహణ కోసం దాదాపు 35 లక్షల రూపాయలు లంచం ఇచ్చామని ఖమ్మం జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం హైకోర్టు కెక్కింది. జిల్లాలోని ఎన్కూర్ లో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ యాజమాన్యం కరస్పాండెంట్ గుగులోట్ చిన్న, హెడ్ మాస్టర్ రమేష్ లు మంత్రిఫై ఈ పిటీషన్ వేసి సంచలనం సృష్టించారు.   మంత్రితో పాటు ఇతర అధికారులకు కూడా దాదాపు 15 లక్షల రూపాయలు ఇచ్చామని వారు హైకోర్టు కు తెలియచేసారు. అయితే, ఈ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం లంచం ఇచ్చిన వారిఫైన కూడా చర్యలు తప్పవని పేర్కొంటూ, దీనిఫై విచారణ సంక్రాంతి తర్వాత ఉంటుందని ప్రకటించింది. సుమారు మూడు సంవత్సరాల క్రితం తమ పాఠశాల ఏర్పాటు సమయంలో వీరందరికీ ఈ లంచాలు ఇచ్చామని పాఠశాల యాజమాన్యం అంటోంది.   తమ పాఠశాలను మూసివేయాలని మంత్రి ఇచ్చిన సూచనల మేరకే ఎంఇఓ తగిన ఉత్తర్వులు జారీ చేసారని, వాటిని నిలిపివేయాలని వారు ఆ పిటీషన్లో పేర్కొన్నారు.   అసలు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే ఇలాంటి వారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా వారు ఆ పిటీషన్లో పేర్కొన్నారు. అసలు ఈ లంచం విషయం ఎలా ఉన్నా, పిటీషనర్లు ప్రస్తావించిన ఈ అంశంఫై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించాల్సిఉంది.

వైసిపి నుండి ఆహ్వానం వచ్చింది : వట్టి

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తనకు ఆహ్వానం వచ్చిందని రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్ వెల్లడించారు. గత రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలియచేసారు.   తనతో పాటు, మంత్రి పితాని సత్యనారాయణ కూడా తమ పార్టీలో చేరుతున్నారంటూ ఆ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అయితే, తాను విద్యార్ధి దశ నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తనకు ఇంత గుర్తింపు, మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీని వదలి రాలేనని వారితో అన్నానని ఆయన అన్నారు.   ఇది సభ్యత ఉన్నవాళ్ళు చేసే పని కూడా కాదని వట్టి వ్యాఖ్యానించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను ఆ పార్టీలో చేరానని వారితో అన్నానని మంత్రి అన్నారు. పదవుల కోసం పాకులాడే వారితో జగన్ పార్టీ నేతలు ఆటలాడుకుంటున్నారని వట్టి అన్నారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ గందరగోళానికి కూడా కారణమవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగేవారు.

ఎంఐఎం అక్బరుద్దీన్ ఫై చర్యలను పరిశీలిస్తున్నాం : స్పీకర్

      మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసిఫై శాసనసభ నిభందనలకు లోబడి చర్యలు తీసుకొనే విషయాన్ని పరిశీలుస్తున్నామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.   అక్బరుద్దీన్ విషయాన్ని శాసనసభ నైతిక విలువల కమిటీకి అప్పగించే విషయాన్ని ఆలోచిస్తున్నామని స్పీకర్ అన్నారు. ఎంఎల్ఏ గా ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంతో స్పీకర్ మనోహర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. అక్బర్ ఈ వ్యాఖ్యలు ఓ బహిరంగ సభలో చేసినప్పటికీ, శాసనసభ నిభందనల పరిధిలో ఎలాంటి చర్యలు ఆయనఫై తీసుకోవాలో కూడా సమీక్ష జరుపుతున్నామని స్పీకర్ అన్నారు. ఆయన చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలను లోతుగా పరిశీలించాలని తనకు చాలా ఫిర్యాదులు అందాయని మనోహర్ ప్రకటించారు.   సభలో సభ్యుడుగా ఉన్నప్పుడు సభ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుందని స్పీకర్ సభ్యులందరికీ సూచించారు. అలాగే, పరిటాల సునీత ఇంటిలో అర్ధరాత్రి చేసిన తనిఖీల విషయంఫై తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని అనంతపూర్ జిల్లా ఎస్ పి ని ఆదేశించానని మనోహర్ అన్నారు.

పరిటాల కేసును కొత్తమలుపు తిప్పిన అదృశ్య హస్తాలు

  పరిటాల తనయుడిని హత్యకేసులో ఇరికించే తొందరలో ఆనంతపురం పోలీసులు, హత్య జరుగకపోయినప్పటికీ, సాధారణంగా హత్యజరిగిన తరువాత మాత్రమే వాడే సెక్షన్ల క్రింద పరిటాల తనయుడు శ్రీరామ్ మరియు ఇతర ముద్దాయిలపై కేసు నమోదు చేయడం, అందుకు కోర్టునుండి మొట్టికాయలు తినడం, ఆ తరువాత మళ్ళీ మరో సెక్షన్ క్రింద కేసు నమోదుచేయడం, వారి అత్యుత్సాహానికి నిదర్శనంగా నిలుస్తోంది.   తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిది రేవంత్ రెడ్డి ఈ రోజు మద్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల ఈ అత్యుసాహానికి కారకులెవరు అని ప్రశ్నిస్తూ, అసలు ఎవరిపైనా హత్యాప్రయత్నం జరిగిందని పోలీసులు కేసులు నమోదు చేసేరో, ఆ వ్యక్తి అనగా సుధాకర్ రెడ్డి స్వయంగా తనకు పరిటాల కుటుంబముతో ఏ వ్యక్తిగత కక్షలు, గొడవలులేవని మీడియా ముందే చెప్పినపుడు, మరి ఏ ఉద్దేశ్యంతో ఈ విధంగా పరిటాల తనయుడు శ్రీరామ్ పై పోలీసులు కేసు నమోదు చేసారని ప్రశ్నించారు.   అంతేగాకుండా, తమ పార్టీకి చెందిన మహిళా శాసనసభ్యురాలయిన పరిటాల సునీత ఇంటిని అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేయడంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ కి లిఖితపూర్వక పిర్యాదు చేయడం, ఆయన వెంటనే స్పందిస్తూ 48గంటల్లో తనకు నివేదికను సమర్పించమని అనంతపురం జిల్లా యస్.పీ.ని ఆదేశించడంతో పోలీసులు తత్తరపడుతూ తమ తప్పు కప్పిపుచ్చుకొనేందుకు తిప్పలు పడుతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కేసు ఒక కొత్త మలుపుతిరిగింది.   ఇంతవరకూ పరిటాల కుటుంబముతో తనకు ఏ వ్యక్తిగత కక్షలు, గొడవలు లేవని మీడియా ముందే చెప్పిన సుధాకర్ రెడ్డి, మాటమార్చి పరిటాల సునీత తమ్ముడు బాలాజీ ఇదివరకు ఒకసారి తనపై హత్యా ప్రయత్నం చేసాడని, మళ్ళీ ఇప్పుడు జరిగిన హత్యప్రయత్నంతో తనకూ, తన కుటుంబానికి కూడా ప్రాణభయం ఏర్పడిందని, అందువల్ల తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కలిపించమని సుధాకర్ రెడ్డి ఈ రోజు ధర్మవరం పోలీసులను కోరారు.   అసలు తాను పరిటాల శ్రీరామ్ పై ఫిర్యాదు చేయలేదని సుధాకరరెడ్డి ప్రకటించారు. తనను ఎవరు టార్గెట్ చేశారో పోలీసులే తేల్చాలని చెప్పిన సుధాకర్ రెడ్డి ఇంత ఆకస్మాతుగా మాట ఎందుకు మార్చేడు? ఆవిధంగా పలికేందుకు అతనిపై ఎవరెవరు ఒత్తిడి తెచ్చేరు? ఎందుకు ఒత్తిడి తెచ్చేరు? అనే కొత్త ప్రశ్నలు పుట్టుకొచ్చి ఈ కుట్ర వెనుక ఎవరో కొందరు రాజకీయ పెద్దల ప్రమేయం ఉండి ఉండవచ్చునని సూచిస్తోంది.    

ఎంఐఎం అక్బరుద్దీన్ ది దేశ ద్రోహమే : వెంకయ్య

    ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసి నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలు దేశ ద్రోహం కిందకే వస్తాయని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన హైదరాబాద్ లో నిన్న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విలేఖరులతో మాట్లాడారు.   పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ కి కోర్టు విధించిన ఉరి శిక్షను ప్రశ్నించడం నేరమేనని నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఓవైసి దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడారని నాయుడు అన్నారు. ఆయనను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.   అసలు ఎంఐఎం పార్టీ ముస్లింల ప్రతినిధి ఎంత మాత్రం కాదని, అది కేవలం రజకార్ల సంస్థ అని నాయుడు అన్నారు. అసలు ఎంఐఎం మైనారిటీలకు చేసిందేమీ లేదని నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన హిందూ దేవుళ్ళను విమర్సిస్తోంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని నాయుడు ప్రశ్నించారు. ఆయన చట్టాన్ని అదుపులోకి తీసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.   ఒవైసీ వ్యవస్థను ప్రశ్నించే విధంగా మాట్లాడుతోంటే ముఖ్య మంత్రి, పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని నాయుడు అన్నారు.

బయటపడుతున్న పరిటాల కేసులో రాజకీయ కోణం..!

  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆమె పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు, పరిటాల శ్రీరామ్ పై నమోదుచేయబడిన హత్యాయత్నం కేసులో ఇమిడిఉన్నరాజకీయకోణం కూడా క్రమంగా బయటకోస్తోంది.   ధర్మవరం పోలీసులు, పరిటాల శ్రీరామ్ అనుచరులుగా చెప్పబడుతున్న ఆరుగురు వ్యక్తులను స్థానిక కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా పోలీసులు పరిటాల శ్రీరామ్ పై కూడా కేసు నమోదు చేసి, అతన్నిఅరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, ఆవిషయం తెలిసుకొన్నపరిటాల శ్రీరామ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, ముందస్తు బెయిలుకోసం కోర్టులో దరఖాస్తు చేసుకొన్నాడు.   పోలీసుల గాలింపు చర్యలో భాగంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బంధువుల ఇళ్ళలో సోదాలు నిర్వహించడం వివాదాస్పదమయింది. ముఖ్యంగా ఒక మహిళా శాసనసభ్యురాలి ఇంట్లో ఆమె అనుమతి లేకుండా రాత్రిపూట పోలీసులు గాలింపు చేప్పటి ఎందుకు అంత అత్యుత్సాహం చూపారో తెలుపాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది. పరిటాల సునీత పత్రికలవారితో మాట్లాడుతూ, హత్యయత్నం మీద అరెస్టు చేసిన వారిని వెంటనే కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా, పోలీసులు వారిని ఇంకా తమ ఆధీనంలోనే ఎందుకు ఉంచుకొన్నారు? అని ప్రశ్నించడంతో పోలీసులు కూడా జవాబు చెప్పలేకపోయారు.   అనంతపురం జిల్లాలో గత అనేక సం.లుగా పరిటాల కుటుంబము తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తూ, ఆ జిల్లాలో పార్టీకి బలమయిన పునాదివేసింది. ప్రస్తుతం హత్యాయత్నం నుండి బయటపడినట్లు చెపుతున్న కాంగ్రెస్ నేత సుధాకర్ రెడ్డి, కొద్దికాలంక్రితం జరిగిన సహకార సంస్థ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయాడు. తన విజయానికి తెలుగుదేశమే గండి కొట్టిందని అయన ఆరోపించినట్లు వార్తలొచ్చాయి కూడా. ఆ ఎన్నికలలో పరిటాల కుటుంబం చక్రం తిప్పడం వల్లనే తను ఓటమి చవిచూసినట్లు భావిస్తున్న సుధాకర్ రెడ్డి, పరిటాల కుటుంభాని, తెలుగుదేశం పార్టీని ద్వేషించడం సహజమే.   ఇక, కొత్తగా బరిలోకి దిగిన వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా ప్రాతినిద్యం వహిస్తున్నతోపుదుర్తి ప్రకాష్ రెడ్డికూడా పరిటాల కుటుంబం తన రాజకీయ ప్రస్తానంలో ఒక అడ్డుగోడగా నిలిచినట్లు భావిస్తూ, పరిటాల కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి మద్య ఉన్న అనుబందము విడగొట్టిననాడే తనకి జిల్లాలో మనుగడ సాధ్యం అని తెలుసుకొన్నాడు. అందుకే, తనకు ప్రమేయంలేని పరిటాల కేసులో వేలు పెడుతూ ఒకనాడు పరిటాల రవిని ప్రోత్సహించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ను కూడా ప్రోత్సహిస్తోందని ఆరోపించేడు. అంటే గాక పరిటాల శ్రీరామ్ తో లోకేష్ కి ఉన్న స్నేహ సంబందాల గురుంచి కూడా ప్రశ్నించేడు. తెలుగుదేశం పార్టీ రాయలసీమలో శాంతి కోరుకొంటే, ముందు పరిటాల సునీతని, ఆమె అనుచరులను పార్టీనుండి బహిష్కరించాలని డిమాండ్ చేసాడు. అంతేగాకుండా పరిటాల శ్రీరామ్ నడుపుతున్న వెబ్ సైటును కూడా వెంటనే పోలీసులు మూయించేయాలని డిమాండ్ చేసాడు.   దీనిని బట్టి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబముకు గల ప్రాముక్యత అర్ధమవుతోంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరో వైపు వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇద్దరూ కూడా తెలుగుదేశం-పరిటాల కుటుంబం మద్యన ఉన్న బలమయిన బందం తెంచగలిగినప్పుడే తమ రాజకీయ ప్రస్థానం సాధ్యమని గ్రహించి, జిల్లాలో తెలుగుదేశానికి పునాదివంటి పరిటాల కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని ఆరంబించిన ప్రయత్నాలలో భాగంగానే పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్బరుద్దీన్ ఫై సర్వత్రా విమర్శలు

      ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలఫై దేశవ్యాప్త దుమారం చెలరేగుతుంది. ఎంఎల్ఏ గా ఉండి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన ఒవైసీను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.   ఓట్ల కోసం ఇలా ప్రజలను రెచ్చగొట్టడాన్ని ఆ పార్టీలు తప్పుబడుతున్నాయి. కాంగ్రెస్, బిజెపిలు ఎంఐఎం నేతఫై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఆయనఫై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు ఆయన ఎంఎల్ఏ గా పనికిరాడంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. భారత దేశంలో అన్ని మతాల ప్రజలు సోదరభావంతో ఉంటారని, ఆ వాతావరణాన్ని ఇలాంటి ప్రసంగాలు చెడగొడతాయని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.   రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి నిన్న ఓ ప్రకటన చేస్తూ, ఒవైసీఫై ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్లు 121, 153 A కింద ఆయన ఫై కేసులు నమోదు చేసామని, ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. లండన్ వెళ్ళినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారని, అవసరమైతే, ఆయనను అరెస్టు చేయడానికి ఇంటర్ పోల్ సహాయం తీసుకొంటామని డిజిపి తెలియచేసారు.   సెక్షన్ 121 అంటే ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం. ఏదేని రెండు వర్గాలు లేక మతాల మధ్య శత్రుత్వం సృష్టించడం సెక్షన్ 153 A కిందకు వస్తుంది.

అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి...అరెస్ట్ చేయండి: పాల్వాయి

        ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఓ దేశద్రోహి అని..మతం పేరుతో వైశమ్యాలు సృష్టిస్తూ హిందూ – ముస్లింల మధ్య కలహాలు రేపేందుకు ప్రయత్నిస్తున్నాడని..అతన్ని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టాలని” కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఇటీవల పలు సభల్లో చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ సురేష్ రెడ్డి తెలిపిన వాదనే కాంగ్రెస్ వాదన అని, తెలంగాణకు కొందరు దోపిడీ దారులు తప్ప ఎవరూ అడ్డులేరని అన్నారు. రాష్ట్ర విభజనను సీమాంధ్రనేతలెవరూ వ్యతిరేకించటం లేదన్నారు. హైదరాబాద్ను శాంతి భద్రతలు వంటి అంశాలను కేంద్రపరిధిలో ఉంచుకుని ప్రత్యేక తెలంగాణ ఇచ్చినట్లు అయితే సీమాంధ్రులకు అభ్యంతరం ఉండదని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చేంతవరకూ హైకమాండ్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు లాబీయింగ్ ఉంటుందన్నారు. పనిలో పనిగా మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పాల్వాయి ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి తెలంగాణ ద్రోహి అని అన్నారు. ఓ సారి తెలంగాణ అంటాడు, మరోసారి జగన్ పార్టీలోకి వెళ్తానంటాడు అని ఆయన ఎద్దేవా చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి vs కోమటిరెడ్డి

  రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ల మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల జరుగుతున్న మాటల యుద్దాన్ని గమనిస్తే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.   జిల్లా రాజకీయాల్లో ఎప్పటినుండో ఉన్న ముఠా పోరులు కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి చిరంజీవి పర్యటనతో ఒక్కసారి బాగ్గుమన్నాయి. వీరిద్దరి మధ్య వ్యక్తిగత మాటల యుద్ధం నడుస్తోంది. చిరంజీవిని, ఆయనను నల్గొండ పర్యటనకు ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ఫై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడు పార్టీలు మారతారో తెలియనివాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లో దస్తీలు వేసుకొని ఇంకా కాంగ్రెస్ లో కొనసాగుతున్నవారు తనను విమర్సిస్తారా అంటూ ఉత్తమ్, కోమటిరెడ్డిఫై ఫైర్ అయ్యారు. తెలంగాణా ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని కూడా ఉత్తమ్ వ్యాఖ్యలు చేశారు.   మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలకు కోమటిరెడ్డి అంతే స్థాయిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణా రాష్ట్రం కోసం తాను రాజీనామా చేస్తే, ఆ స్థానంలో మంత్రి పదవి చేపట్టిన నేతలకు తన గురించి మాట్లాడే అర్హత లేదంటూ కోమటిరెడ్డి బదులిచ్చారు.   తాను పార్టీ మారనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు విమర్శలు చేస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ మాటల యుద్ధం ఏ స్థాయికి చేరుతుందో మాత్రం వేచి చూడాల్సిందే.

యాన్టిసిపేటరీ బెయిల్ కోసం పరిటాల శ్రీరామ్ పిటిషన్

  అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కాంగ్రెస్ నేత సుధాకర్ పై గత వారం జరిగిన హత్య ప్రయత్నంలో పట్టుబడ్డ నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ధర్మవరం పోలీసులు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలు పరిటాల సునీతా కుమారుడయిన పరిటాల శ్రీరామ్ పేరును కూడా జేర్చడంతో, అతను గత మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు శాసన సభ్యురాలు పరిటాల సునీత మరియు వారి బందువుల ఇళ్ళలో కూడా సోదా చేయడం వివాదాలకు తావిచ్చింది. అయితే, పరిటాల శ్రీరామ్ కోర్టులో లొంగి పోబోతున్నట్లు అనంతపురంలో జోరుగా పుకార్లు ప్రచారం అవడంతో, మీడియా అక్కడికి జేరుకొంది. ఆ వార్త తెలిసిన పరిటాల శ్రీరామ్ సానుభూతిపరులు కూడా పెద్దఎత్తున హడావుడిగా కోర్టువద్దకు జేరుకోవడంతో ఒక్కసారిగా కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలఎత్తాయి. గానీ, కోర్టు మూసేసే సమయానికి కొద్ది నిమిషాల ముందు పరిటాల శ్రీరామ్ కు బదులు, అతని లాయర్ వచ్చి కోర్టులోఅతని తరపున యాన్టిసిపేటరీ బెయిలు పిటిషను దాఖలు చేసారు. కోర్టు ఆ పిటిషన్ పై విచారణ ఈరోజు చేపట్టవచ్చునని సమాచారం.