చంద్రబాబు పాదయాత్ర ప్రత్యక్ష్య ప్రసారం

చంద్రబాబు పాదయాత్ర ప్రత్యక్ష్య ప్రసారం

 

 

 

చంద్రబాబు పాదయాత్ర ఇక ప్రత్యక్ష్య ప్రసారం కాబోతుంది. చంద్రబాబు ప్రతి అడుగు ఇక ప్రత్యక్ష్యంగా ఆన్ లైన్ లో వీక్షించవచ్చు. వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న భారీ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. త్వరలో అది వందరోజులు కూడా పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పాదయాత్రను ఇంటర్‌నెట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. యూట్యూబ్, గూగుల్ ప్లస్ హ్యాంగవుట్ వెబ్‌సైట్ల ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం జరుగనుంది.


చంద్రబాబు పాదయాత్ర ప్రజలను ఎంతో ఆకర్షిస్తుందని, ఆసక్తి ఉన్నవారు పాదయాత్ర లో ప్రత్యక్ష్యంగా పాల్గొనలేకపోయిన వారి కోసం ఈ పాదయాత్రను ప్రత్యక్ష్య ప్రసారం చేయడానికి ఏర్పాటు చేసినట్లు పార్టీ ఐటీ విభాగం అధిపతి టి. శ్రీనివాసరావు తెలిపారు. www.telugudesam.org వెబ్‌సైట్‌లో కూడా ఈ పాదయాత్రను ప్రత్యక్ష్యంగా వీక్షించవచ్చు.

Teluguone gnews banner