Read more!

 పల్నాటి బొబ్బిలి బ్రహ్మానందరెడ్డి రాకతో మాచర్లలో టిడిపి గెలుపు ఖాయం 

పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు. పల్నాడు పౌరుషం, ఆత్మాభిమానం నిలువెల్లా నిండి ఉన్న జూలకంటికి జనం జేజేలు కొడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో జూలకంటి పేరు చెబితేనే జనం కేరింతలు  కొడుతున్నారు. జూలకంటి మాతృమూర్తి దుర్గాంబ కూడా ఇదే నియోజకవర్గం నుంచి విశేష సేవలందించారు. ఆమె గుడ్ విల్   బ్రహ్మానందరెడ్డి గెలుపుకు దోహదపడనుంది.  1999లో మాచర్ల నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరడానికి ప్రధాన కారణం దుర్గాంబ. అయితే ఈ సారి కూడా టిడిపి జెండా ఎగరేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఎమ్మెల్యేగా సేవలందించడంతో బ్రహ్మనందరెడ్డికి సానుకూలాంశం. బ్రహ్మానందరెడ్డి  తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా మాచర్ల శాసనసభకి పోటీ చేసి విజయం సాధించగా 1983 లో గురజాల నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు ,
రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న బ్రహ్మానందరెడ్డి  ఈ సారి కూటమి అభ్యర్థిగా గెలుపొందే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పల్నాడులో గత 20 ఏళ్ల నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. ఈ సారి టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో గెలుపు సునాయసం కానుంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్ర జా  వ్యతిరేకత రోజు రోజుకు ఎక్కువ కావడంతో బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని   తేలిపోయింది.పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 
1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నికయ్యారు.
1955లో మాచర్ల తొలి ఎమ్మెల్యేగా సీపీఐ నేత మండపాటి నాగి రెడ్డి విజయం సాధించారు. 1962లో ముదావత్ కేశవ్ నాయక్ గెలవగా.. 1967లో వెన్న లింగా రెడ్డి గెలిచారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జూలకంటి నాగిరెడ్డి గెలుపొందగా.. 1978లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చల్లా నారప రెడ్డి గెలుపొందారు.1983 నుంచి 1999 వరకు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 1985 మినహా మిగతా నాలుగు పర్యాయాలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. కానీ 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1983లో కొర్రపాటి సుబ్బారావు విజయం సాధించగా.. 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణ ప్రసాద్, 1994లో కుర్రి పున్నా రెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1985లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు , దివంగత నేత  కృష్ణ విజయం సాధించారు.2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ ఏరి కోరి మరీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి టికెట్ కేటాయించింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులైన జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ ఇద్దరూ మాచర్ల ఎమ్మెల్యేలుగా పని చేశారు. నాగిరెడ్డి 1972లో ఇండిపెండెంట్‌గా గెలవగా.. దుర్గాంబ 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోటీ వుంటుంది... ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందినవారే బరిలోకి దిగుతుండటంతో  మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసిపి మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది. పల్నాడులో టీడీపీ కంచుకోటగా పిలువబడే మాచర్ల నియోజకవర్గానికి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మనందరెడ్డిని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. బ్రహ్మానందరెడ్డికి  బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తలు, నాయకులు  అప్పట్లో పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే, అందుకు సరైనోడు జేబీఆర్ మాత్రమేనని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. రెండేళ్ల క్రితం  మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జిగా నియమితులైన బ్రహ్మానందరెడ్డి  అటు పార్టీకి ఇటు ప్రజలకు విశేష సేవలందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలుపును కన్ఫర్మ్ చేశారు.