Read more!

కెప్టెన్సీ పోయినా.. కోపం పోలే.. కోహ్లీ త‌గ్గేదేలే..

యాంగ్రీ యంగ్ మ్యాన్‌. ఇది ఏ హీరో బిరుదో కాదు. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌. మాటంటే ప‌డ‌డు. మాట‌కు మాట‌ని తీరుతాడు. అరిస్తే ఊరుకోడు. మ‌రింత గ‌ట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తాడు. మీద మీద‌కు వ‌స్తే ఊరుకోడు. మ‌రింత మీద‌కు ఉరుముకొస్తాడు. ఈ దూకుడు స్వ‌భావ‌మే.. కోహ్లీకి మ‌రింత ప్ర‌త్యేక‌త తీసుకొచ్చింది. టీమిండియాకు కెప్టెన్‌ని చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల మందిని ఫ్యాన్స్ చేసింది. ఇటీవ‌ల‌ వ‌న్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ త‌న‌ను అర్థాంత‌రంగా తొల‌గించినా.. టెస్ట్ కెప్టెన్సీని తానే స్వ‌యంగా వ‌దులుకున్నా.. త‌న‌కు స్వ‌త‌హాగా వ‌చ్చిన దూకుడును మాత్రం అట్టే పెట్టుకున్నాడు. అలానే కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే.. ఆ కోపం లేనిదే కోహ్లీ లేడు.. ఆ ఆవేశం లేనిదే అత‌డు లేడు.. అత‌ని ఆట తీరుకు డీఫాల్ట్ సెట్టింగ్ ఆ యాంగ్రీ యాటిట్యూడ్‌.

కెప్టెన్‌గా అగ్రెసివ్‌గా ఉండే విరాట్ కోహ్లీని ఇన్నాళ్లూ మ‌నం చూశాం. లేటెస్ట్‌గా, ఐదున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని.. జ‌స్ట్ బ్యాట్స్‌మెన్‌గా త‌ను ఆడిన‌ తొలి వన్డే మ్యాచ్ చూశాం. అందులోనూ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిపోయాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేలో భారత్ ఓడిపోయినా.. కోహ్లీ మాత్రం బ్యాటింగ్‌లో గెలిచాడు. 

ఈ మ్యాచ్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జ‌రిగింది. కెప్టెన్సీ లేకపోయినా మైదానంలో తన దూకుడు ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు. ఇండియా, సౌత్ ఆఫ్రికా ఫ‌స్ట్ వ‌న్డేలో.. టెంబా బవుమా (110), డస్సెన్ (129*) సెంచ‌రీల‌తో రాణించారు. 36వ ఓవర్‌లో మాజీ కెప్టెన్ కోహ్లీ, స‌ఫారీల కెప్టెన్‌ టెంబా బవుమా మధ్య డైలాగ్ వార్ న‌డిచింది. 

చాహల్‌ వేసిన బంతిని బవుమా కొట్టగా మిడాన్‌లో ఉన్న కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే కీపర్‌కు బాల్‌ను త్రో చేశాడు. ఆ బాల్ బవుమా పైనుంచి వెళ్లింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకున్నారు. కొద్దిసేపటికే ఆ వివాదం సద్దుమణిగింది. తాను కెప్టెన్‌ను కాదు.. త‌న‌కేంటి అని లైట్ తీసుకోకుండా.. మాట‌కు మాట గ‌ట్టిగానే స‌మాధానం ఇచ్చాడు కోహ్లీ. ద‌టీజ్ రియ‌ల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.