నేటి కోర్టు తీర్పు పై ఆర్టీసీ జేఏసీ ఉత్కంఠ

ఆర్టీసీ జేఏసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో ఇరవై ఐదో రోజుకు చేరుకుంది. మొత్తం ఇరవై ఆరు డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేపట్టిన కార్మికులు ప్రభుత్వం పై తమదైన శైలిలో తిరుగుబాటును కొనసాగిస్తూ వస్తున్నారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాల జేఏసీ తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.  రోజుకో రకంగా నిరసనలతో తమ డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మరోసారి సమావేశం అవ్వనుంది.  హైకోర్ట్ ఇచ్చే తీర్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కార్మిక సంఘాల నాయకులు తమ భవిష్యత్ కార్యాచరణపై నేడు సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తమ సమస్యలకు ప్రభుత్వం అంగీకరుంచకపోవటంతో పోరాటాన్ని ఎలా ముందు కు తీసుకెళ్లాలి అన్న విషయం పై చర్చించబోతున్నారు.

ఆర్టీసీ జేఏసీ కార్మికులు రేపు సరూర్ నగర్ లో జరగబోయే బహిరంగ సభపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. నేటి మధ్యాహ్నం కోర్టు తీర్పు తర్వాత కార్యాచరణను ప్రకటించే ఆలోచనలో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఉన్నట్లుగా తెలుస్తోంది . సతుపల్లి లో ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి  సంబంధించి సంతాప సభలను ఆర్టీసి జెఎసి నాయకులు  అన్ని డిపోల లో ఏర్పాటు చేసి ఆమెకు సంతాపం తెలపనున్నారు. నేటి కోర్టు తీర్పు విషయం లో ఆర్టీసి జెఎసి నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో‌  ఎదురు చూస్తున్నారు. సమ్మె ఎప్పుడు ఆగుతుందా మళ్ళీ తిరిగి బస్సులు యధావిధంగా తిరుగుతాయా అని ప్రజలు నేడు కోర్టు ఇచ్చే తీర్పు పై ఎన్నో ఆశలతో‌ ఉన్నారు. సంతాప సభలను పదకొండు గంటల కల్లా పూర్తి చేసి, కోర్టు తీర్పు వచ్చాక రేపై సరూర్ నగర్ బహిరంగ సభపై తదుపరి ప్రణాలికని సిద్దం చేసుకోవాలని ఆర్టీసి జెఎసి నాయకులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Teluguone gnews banner