జిపిఎస్ ట్రాక‌ర్ల ప‌ట్ల  ప్రభుత్వ డాక్టర్ల నిర‌స‌న‌

టి ఆర్ ఎస్ ప్రభుత్వ విధానాల పై  ప్రభుత్వ డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ప్రభుత్వ డాక్టర్లు పనివేళలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం పై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు ప్రభుత్వ డాక్టర్ల పనివేళ లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేవారి పై  పర్యవేక్షణ చేయాలని  ఇందుకోసం ప్రభుత్వ డాక్టర్ల్ ఫోన్లలో జిపిఎస్ ట్రాకర్ ను అమర్చడం ద్వారా ప్రభుత్వ డాక్టర్ల పనితీరు ను నిరంత‌రం పర్యవే క్షణకు ప్రభుత్వ  ఆరోగ్య శాఖ  నిర్ణయించింది.

ఈమేరకు ప్రభుత్వ డాక్టర్లు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు సి సి టి వి ల ద్వారా మానిటర్ చేయాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి ద్వారా ఆదేశాలు త్వరలో అందనున్నట్లు విశ్వనీయ సమాచారం.
ఇప్పటికే సాధారణ పరిపాలన విభాగానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈమేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ కు ప్రభుత్వ డాక్టర్ల  ప్రైవేట్ ప్రాక్టీస్ పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

ప్రభుత్వ నిర్ణయం పై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ఆదేశాలు నమ్మలేకపోతు న్నామని అంటున్నారు. ప్రభుత్వం ఆదేశాలను మొండిగా అమలుచేస్తే చూస్తూ ఊరుకోబోమని న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని డాక్ట‌ర్లు హెచ్చరించారు.

ఈ అంశం పై డాక్టర్ రమేష్ మాట్లాడుతూ డాక్టర్లు తీవ్రవాదులు కాదని వారికి జి పి ఎస్ ట్రాకర్ అమర్చ డం అంటే అవమానించడమే అని డాక్టర్ల  విశ్వాస నీయతను దేబ్బతీసినట్లే అని అన్నారు. జి పిఎస్ ట్రాకర్లు డాక్టర్స్ ఫోన్లలో అమర్చడం నిబంధనలకు విరుద్ధమని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్స్ అంటున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈమేరకు ఇప్పటికే  ఒక  నివేదిక  సిద్ధం చేసిం దని డాక్టర్ల పై పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ బయోమెట్రిక్  అటెండెన్స్ పునరుద్దారించాలాన్న ప్రభుత్వ నిర్ణయం సరికా ద‌ని పేర్కొన్నారు.

మాపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని లేనిపక్షంలో కోర్టుకు వెళతామని ఇన్నిసంవత్చారాల అనంతరం మాపై విచారణ చేయడంపై తీవ్రంగా స్పందించారు. మాహక్కులు ఎలా పరిరక్షించుకోవాలో మాకు తెలుసునని అవసరమైతే సమ్మె నోటీసు ఇచ్చేందుకు వేనుకాడ బోమని డాక్టర్లు హెచ్చరించారు.

Advertising
Advertising