సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో విషాదం.. గోడకూలి ఎనిమిది మంది మృతి

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.  సింహాచలం బస్టాండ్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూ లైన్ వద్ద  ఈ దుర్ఘటన జరిగింది.

మంగళవారం (ఏప్రిల్ 29) అర్థరాత్రి దాటిన తరువాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఆ కారణంగానే గోడ కూలింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. గోడ కూలిన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎష్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలం వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.  

Teluguone gnews banner