తెలంగాణ పై కేసిఆర్ కు లగడపాటి సవాల్
posted on Jan 19, 2013 @ 9:34AM
కేసిఆర్ కు దమ్ముంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పోటిచేసి గెలవాలని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు. ఒక వేళ రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.
ఈ నెల 28న తెలంగాణ విషయంలో ఏమీ తేలదు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వదు. ఏం జరుగుతుంది ? ఏం జరిగితే ఏం చేయాలి ? అన్నది నాకు మాత్రమే తెలుసు” అని లగడపాటి రాజగోపాల్ అన్నారు. విభజన వార్తల్లో వాస్తవం లేదని, రాష్ట్ర విభజన ముమ్మాటికి అవాస్తవమని చెప్పారు. 2014 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతాయి అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రాష్ట్రం ఇవ్వాలో తెలుసునని, అందుకే దాని గురించి ఏమి తేల్చడం లేదన్నారు. టిడిపి లేటర్ ఇచ్చింది కాబట్టే తెలంగాణకు కొంచెం మొగ్గు కనిపిస్తుంది అంతే తప్పితే, తెలంగాణ ఇచ్చే పరిస్థతి లేదు. తెలంగాణ అంశం పై ఈ నెల 21న చంద్రబాబు ను కలిసి, ఆయన సమైక్యవాదానికి మద్దతు ఇచ్చేలా చేస్తాం అని లగడపాటి అన్నారు.