షర్మిల సవాల్ కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్

 

వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ కార్యకర్త షర్మిల పాదయాత్రలో చంద్రబాబుపై చేసిన సవాల్ ను టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి స్వీకరించారు.  ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపించాలనే బయ్యారం గనులను వై.ఎస్. మంజూరు చేసినట్టు షర్మీల చెబుతున్నారని కానీ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ మర్నాడే ఒప్పందం కుదుర్చుకున్న విషయం షర్మిలకు తెలియదేమోనని, ఈ విషయాలను తాను అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం మందబలంతో తప్పించుకుందని, ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అనుమతి పొందిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ బంధువైన కొండలరావుకు నిజంగా 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉందా అని, కొండలరావు బ్రదర్ అనిల్ కుమార్ కు బినామీ అని, రక్షణ స్టీల్స్, బ్రదర్ అనిల్ డైరెక్టర్ గా ఉన్న మిరాకిల్ ఫార్ములేషణ్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్ లోని డి-203, ఆదిత్య ఎలైట్, బిఎన్. మక్తా, సోమాజిగూడ అన్న చిరునామాలోనే ఉండడం ఇందుకు నిదర్శమని స్పష్టం చేశారు. మతపరమైన వ్యవహారాలూ కూడా ఈ చిరునామా నుంచే సాగించేవారని, షర్మిల ఇప్పటికైనా తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్ళిపోవాలని, షర్మిల పాదయాత్ర చేసినా, క్యాట్ వాక్ చేసినా మాకేమిటని, కొండలరావు మీ బినామీ కాకపొతే సిబీఐ తో విచారణను ఎందుకు కోరలేదని, షర్మిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ప్రభుత్వానికి విచారణ కోరుతూ లేఖ వ్రాయాలని సవాల్ విసిరారు.

Teluguone gnews banner