ముగిసిన సంపూర్ణ సూర్య గ్రహణం......
posted on Dec 26, 2019 @ 11:05AM
సాధారణంగా 11 గంటల సమయం అంటే చాలు సూర్యుడు మనల్నే చూస్తూ ఉంటాడు కానీ ఇవాళ 11 అవుతున్నా బయట వాతావరణం చల్లగా మారిపోయింది. ఎండే లేదు, ఎందుకంటే సూర్యుడు మాయమైపోయాడు. పట్టపగలు కూడా ఇంట్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, సూర్యగ్రహణం ముగుస్తొంది. ఈ ఏడాదికే కాదు ఈ దశాబ్దానికి ఇది ఆఖరి సూర్యగ్రహణం. నింగిలో జరుగుతున్న ఈ అద్భుతాన్ని ఖచ్చితంగా చూసితీరాల్సిందే లేదంటే జీవితంలో ఓ అరుదైన క్షణాన్ని మిస్సయి పోతాము. సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది, విద్యార్థులు యువకుల రోడ్ల పై కొచ్చి గ్రహణాన్ని వీక్షిస్తున్నారు.
దేశమంతటా రింగ్ ఆఫ్ ఫైర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏడాది వార్షిక సూర్యగ్రహణంగా దీన్ని పిలుస్తున్నారు. సూర్యుడు భూమి మధ్యేమార్గాని చంద్రుడు అడ్డుకున్న సమయంలో సూర్యగ్రహణం వస్తుంది. సూర్యుని కప్పి ఉండడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది. ఆయా సందర్భాన్ని బట్టి పాక్షికంగా లేదంటే సంపూర్ణంగా సూర్య లేదా చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఉదయం 9 గంటల 4 నిమిషాలకు సంపూర్ణ స్థితికి చేరుకున్న సూర్యగ్రహణం ఉదయం 11:16 నిమిషాలకు ముగుస్తుంది.
సూర్యగ్రహణం గరిష్ఠంగా మూడు నిమిషాల నలభై సెకన్ల పాటు ఉండనుంది. సూర్యగ్రహణం భారత్ తో పాటు అస్ట్రేలియా, ఫిలిపీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్ లలో కనిపిస్తుంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, ఒమన్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, ఉత్తర మరియానా ద్వీపం, గ్వామ్ లో వార్షిక సూర్యగ్రహణం కనిపిస్తుంది. కోజికోడ్, కోయంబత్తూర్, జాప్నా, ట్రింకోమలీ, సింబోల్ గా, బాటమ్, సింగపూర్, సింకవ్వాంగ్, గ్వామ్ లో సంపూర్ణ సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. అయితే గ్రహణం సమయంలో ఆహారం తీసుకోవద్దని, నీరు కూడా తాగొద్దు అని పెద్దలు చెబుతుంటారు. గ్రహణానికి ముందు నుంచే ఇంట్లో వంట చేయకూడదు అని అంటారు. ఇంట్లో ఉన్న వృద్ధులకూ ఆహారానికి బదులు ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలని సూచిస్తారు. సూర్యరశ్మి కనిపించని సమయంలో బాక్టీరియా చురుగ్గా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.