జనం సొమ్ము నేరుగా ఖాతాల్లోకే

 

 

ఇకపై రేషన్ షాపు డీలర్ మీ దగ్గర కిల్ చక్కెరకు రెండునుంచి ఐదు రూపాయల కమిషన్ కొట్టలేడు.

గోధుమలిచ్చేటప్పుడు చిల్లరలేదని ఎగ్గొట్టడానికి వీల్లేదు. ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా నిత్యావసర

సరుకుల్ని తీసుకుంటున్నవాళ్లకి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది.

ఇక నేరుగా సబ్సిడీ సొమ్ముని బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

 

సబ్సీడీని నేరుగా అకౌంట్లలో వేసే ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుగా ఆధార్ కార్డుల్ని పక్కాగా ఇష్యూచేసే ప్రక్రియని ప్రభుత్వం సీరియస్ గా టేకప్ చేసింది. ఆధార్ కార్డులున్న వాళ్లందరికీ రేషన్ సబ్సిడీని  నేరుగా అకౌంట్లలోకి జమచేసేందుకు ఆగమేఘాలమీద ఏర్పాట్లు జరుగుతున్నాయ్. 2103 ఏప్రియల్ నాటికి ఈ పథకాన్ని 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014కల్లా మరో 16 రాష్ట్రాలకు విస్తరిస్తారు.

 

telugu one news

Teluguone gnews banner