Read more!

ఏపీ స్కూల్ లో కలకలం..  ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థులు...

ఏపీలోని ఏలూరు నగరంలో కొన్ని నెలల క్రితం ఒక వింత వ్యాధి కలకలం రేపిన సంగతి తెల్సిందే. తాజాగా మరోసారి ఈ వింత వ్యాధి మళ్ళీ కలకలం రేపుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడలో పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది. గుడివాడలో ఉన్న ఆర్సీఎం మిషనరీ స్కూల్లో విద్యార్థులు ఒక్కసారిగా కళ్లు తిరిగిపడిపోవడం తాజాగా ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదిమంది విద్యార్థులు ఒక్కసారిగా క్లాస్ రూములోనే కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించింది. అయితే బాధిత విద్యార్థులంతా 1, 2 తరగతులు చదువుతున్న చిన్నారులు కావడం గమనార్హం. ఆ విద్యార్థులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి క్లాస్ రూమ్ లోనే పడిపోయారని.. ప్రస్తుతం వారు ఇంకా మైకంలోనే ఉన్నట్లు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు.  చిన్నారులందరికి  ప్రస్తుతం సెలైన్ ఎక్కిస్తూ డాక్టర్ల అబ్జర్వేషన్ లో చికిత్స అందిస్తున్నారు. ఆ విద్యార్థులలో కొంతమంది కడుపు నొప్పితో విలవిల్లాడుతున్నారని సమాచారం ..

ఇది ఇలా ఉండగా విద్యార్థులు తమ ఇళ్ల వద్దే టిఫిన్ చేసి స్కూలుకు వచ్చారని.. అంతేకాకుండా స్కూల్లో కూడా లంచ్ కి ముందే ఈ ఘటన జరిగిందని.. దీంతో ఫుడ్ పాయిజన్ కారణమా అయ్యే అవకాశమే లేదని టీచర్లు చెప్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేవడం, కేకలు వేయడం చేస్తున్నట్లు పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే ఆ విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణాలపై డాక్టర్లుఇంకా ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో విద్యార్థులు /కోలుకోని ఎం జరిగిందో చెప్తేగానీ ఈ మిస్టరీ వీడే అవకాశం కనిపించడం లేదు. ఇంకోపక్క ఆ చిన్నారుల తల్లిదండ్రులను కరోనా భయం కూడా వెంటాడుతోంది. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్, ఎస్పీ కూడా ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.