అఖిలప్రియ భర్తపై కేసు నమోదు.. ఎస్ఐని కారుతో ఢీకొట్టే ప్రయత్నం!!

 

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌పై  వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో భార్గవరామ్‌పై కేసు నమోదైంది. విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ ఫిర్యాదు చేశారు. 

కొద్ది రోజుల క్రితం.. ఆళ్లగడ్డలో ఓ స్టోన్ క్రషర్ బిజినెస్ వ్యవహారంలో భార్గవరామ్ బెదిరించాడంటూ కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ప్రశ్నిస్తామంటూ ఆళ్లగడ్డ ఎస్‌ఐ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో భార్గవరామ్ ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లారు. అయితే భార్గవరామ్ తనకు సహకరించకుండా తనను కారుతో ఢీకొట్టేలా రాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్లిపోయారని.. ఆళ్లగడ్డ ఎస్‌ఐ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనపై కేసు నమోదయింది. ఐపీసీ సెక్షన్‌ 353, 336 కింద అఖిలప్రియ భర్తపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Teluguone gnews banner