Read more!

ఏదో చేద్దామనుకున్నాను... ఏమీ చేయలేకపోతున్నా

 

 

‘‘ఏదో చేద్దామనుకున్నాను. కానీ ఏమీ చేయలేకపోతున్నాను. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అసంతృప్తితోనే ఉన్నాను. నా నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఎంత ప్రయత్నించినా పనులు చేపట్టలేకపోయా. కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా వేయించలేక పోయాను’’ అని ప్రముఖ సినీ నటి, ఎమ్మెల్యే జయసుధ ఆవేదన చెందుతున్నారు. నేతల్లో వ్యక్తిగత లాభం గురించే తప్ప వ్యవస్థను బాగుచేయాలన్న ఆలోచన కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.


 

మొదట జగన్ పార్టీకి మద్దతు పలికి ఆయన దీక్షలకు హాజరయిన జయసుధ ఆ తరువాత ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సేవ చేయలేనిది ఏ పార్టీలో ఉంటే ఏం..కనీసం సేవ చేసే అవకాశం అయినా లభిస్తే ఏదో పార్టీలోకి మారినా ప్రయోజనం ఉంటుంది అని అన్నారు. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఉన్న క్రైస్తవుల ఓట్లను చూసి జయసుధను వైఎస్ రాజకీయాల్లోకి దింపారు. అక్కడ ఆ మతం అభ్యర్థి అయితే సులభంగా గెలవగలరని వైఎస్ ఊహించారు. మతానికి తోడు జయసుధ గ్లామర్ కూడా విజయానికి బాటలు వేసింది. సీనియర్ నటి అయిన జయసుధ మాటలు వింటుంటే రాజకీయాలలో అంత తృప్తిగా లేరని తెలుస్తూనే ఉంది.