సైనికుల గొడవ.. ఒకరి మృతి

 

సరిహద్దుల్లో వుండి శత్రు సైనికులను, చొరబాటుదారులను, ఉగ్రవాదులను ఎదుర్కొండయ్యా అని నియమించిన సైనికులలో కొంతమంది ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాళ్ళలో ఒక సైనికుడు తనమీద తాను అదుపు కోల్పోయాడు. అంతే తన దగ్గరున్న గన్‌తో తోటి సైనికుల మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక సైనికుడు మరణించగా, మరికొంతమంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడో, ఏదో దేశంలోనో జరిగింది కాదు... ఇలా కాల్పులు జరిపింది మన భారత జవానే. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా సైనిక శిబిరంలో ఈ ఘటన జరిగింది. ఇలా కాల్పులు జరిపిన సైనికుడిని మిలటరీ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.

Teluguone gnews banner