Read more!

దస్తగిరిని కాపాడు దేవుడా!

గురువారం నాడు పులివెందులలో జగన్మోహన్‌రెడ్డి నామినేషన్ వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరిట ఈనెల 22వ తేదీన ఆయన మరో బాబాయ్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం నాడు జగన్ స్వయంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా లోకల్‌గా వున్న వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు పులివెందులకు వచ్చే అవకాశం వుంది. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇల్లు మరెక్కడో లేదు.. జగన్ ఇంటికి కూత వేటు దూరంలోనే వుంటుంది. గురువారం నాడు జగన్ నామినేషన్ సందర్భంగా దస్తగిరి ఇంటి మీదకి వైసీపీ కార్యకర్తలు ఆవేశంతో దాడి చేసి లేపేసే ప్రమాదం వుందనే అనుమానాలు వున్నాయి. అందుకే దస్తగిరికి బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. ప్రస్తుతం 3 ప్లస్ 3, 4 ప్లస్ 4 భద్రత నుంచి 4 ప్లస్ 4, 10 ప్లస్ 10 స్థాయికి భద్రతను పెంచారు. ఇదిలా వుంటే వైసీపీ కారకర్తల బారి నుంచి దస్తగిరిని కాపాడు దేవుడా అని దస్తగిరి కుటుంబ సభ్యులు ప్రార్థిస్తున్నారు.

ఇదిలా వుంటే, మరోవైపు దస్తగిరి కూడా ర్యాలీగా వెళ్ళి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరఫున దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేస్తానని, తనకు అధికారులు అడ్డుపడుతున్నారని దస్తగిరి అంటున్నారు. అధికారులు అడ్డుకున్నా తాను గురువారం నాడు నామినేషన్ వేయడం ఖాయమని ఆయన అంటున్నారు. తాను నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేసే అవకాశం వుందని దస్తగిరి అనుమానిస్తున్నారు.