తెలంగాణాకు జగన్ పార్టీ ఓకె ?

 

 

 

 

రేపు జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణాకు అనుకూలంగా తన నిర్ణయం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యెక రాష్ట్రాన్ని ఇస్తే, తమకు అభ్యంతరం లేదని జగన్ పార్టీ ఈ సమావేశంలో తన అభిప్రాయంగా చెప్పనుంది. తన తల్లి విజయమ్మ ద్వారా, పార్టీ నిర్ణయాన్ని జగన్ తన పార్టీ నేతలకు అధికారికంగా తెలియచేసినట్లు సమాచారం.

 

ఒక వేళ పార్లమెంట్ లో తెలంగాణాఫై బిల్లు ప్రవేశపెడితే, దానికి తాము మద్దతు ఇస్తామని కూడా ఆ పార్టీ ప్రతినిధులు మైసూరా రెడ్డి, మహేందర్ రెడ్డి లు సమావేశంలో చెప్పనున్నట్లు తెలుస్తోంది. దీనితో, తెలంగాణాఫై సత్వర నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయనున్నారు. మైసూరా రెడ్డి వ్యక్తిగతంగా తెలంగాణా కు అనుకూలం కానప్పటికీ, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

 

తెలంగాణా అనుకూల వైఖరి తీసుకున్నా, సీమాంధ్ర ప్రాంతంలో తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని జగన్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలఫై ప్రజలకు వ్యతిరేకత ఉన్నందున, సీమాంధ్ర ప్రజలకు తమ పార్టీకి ఓటు వేయడం తప్ప మరో మార్గం ఉండదని ఆ పార్టీ భావిస్తోంది. మరో వైపు ఈ వైఖరి వల్ల తెలంగాణా ప్రాంతంలో తమ ఓటు బ్యాంకు పెరుగుతుందనేది ఆ పార్టీ నేతల అంచనా.

Teluguone gnews banner