అమెరికా పై నటుడు జాకీచాన్ ఫైర్
posted on Jan 13, 2013 @ 12:32PM
అమెరికా పెద్దన్న తరహా వైఖరిపై హాంగ్ కాంగ్‌కు చెందిన నటుడు జాకీచాన్ మండిపడ్డారు. అమెరికానే ప్రపంచంలో అతిపెద్ద లంచగొండి దేశమని ఆయన చైనాకు చెందిన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చైనా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న దేశమని అమెరికా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి తెలివి తక్కువతనానికి తార్కాణమని చాన్ అన్నారు.
ఇతర దేశాలలో మాదిరిగానే చైనాలో కూడా అవినీతి ఉండొచ్చు, అయితే అమెరికాలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ హాలీవుడ్ నటుడు విమర్శిం చారు. చైనా నేతలు భారీ స్థాయిలో ముడుపులు పుచ్చుకున్నారని లెక్కలతో సహా న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాయడంపై జాకీచాన్ విమర్శలు గుప్పించారు. చైనా నేత జియాబావో కుటుంబం 2.7 బిలియన్ డాలర్లు లంచం పుచ్చుకున్నారని పలు అమెరికా పత్రికలు వెల్లడించాయి.