Read more!

ఈ 4 విషయాలు శాంతికి, సంతోషానికి మార్గం వంటివి.!

ప్రతి ఒక్కరూ ఆనందం, శాంతి  కూడిన జీవితం కోసం  ప్రయత్నిస్తారు. కానీ, ఈ మధ్య కాలంలో డబ్బు అనే తోకలేని గుర్రం వెనుక పరుగులు తీయడంలో ఆనందం, శాంతి, సంతోషం మర్చిపోతున్నారు. డబ్బుతోనే  సుఖం, శాంతి, సంతోషం అనే కాలం వచ్చేసింది. ఆచార్య చాణక్యుడు ప్రశాంతమైన,  సంతోషకరమైన జీవితం కోసం కొన్ని సూత్రాలను అందించాడు. ఆ సూత్రాలు ఏమిటో తెలుసా?


ఆచార్య చాణక్యుడి అనుభవాలు,  నీతి సమాహారమైన 'చాణక్య నీతి'లో సరైన జీవన విధానాల గురించి సమాచారం ఉంది. మీరు జీవితంలో విజయం, ఆనందాన్ని పొందాలనుకుంటే, ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలను ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే వారు మీ ఇంటిని స్వర్గంగా మార్చే సంతోషకరమైన జీవితం కోసం కొన్ని ప్రాథమిక మంత్రాలను చెప్పారు. ఇవి పాటిస్తే ప్రతిఒక్కరూ జీవితంతో ఆనందాన్ని పొందగలరు. సంతోషకరమైన జీవితానికి అత్యంత ముఖ్యమైన చాణక్యుడి తత్వశాస్త్రంలోని ఆ నాలుగు అంశాల గురించి తెలుసుకుందాం.

1. శాంతి:

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా మానవ జీవితంలోని ప్రతి మలుపులోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. చాలా సార్లు ఇలాంటి సమస్యలు మనల్ని మానసికంగా బలహీనపరుస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శాంతియుతంగా పని చేస్తే, అన్ని సమస్యలకు పరిష్కారం సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే అయోమయమైన మనస్సుతో మనిషి ఏ సమస్యను ఎదుర్కోలేడు లేదా దాని నుండి బయటపడలేడు. కాబట్టి మీరు మీ ఇంట్లో సంతోషాన్ని కోరుకుంటే, ఏదైనా సమస్యను సులభంగా ఎదుర్కోవటానికి మీరు శాంతితో నడవాలి.

2. ఆత్మసంతృప్తి:

 ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నడుస్తున్న జీవితంలో ఒకరికొకరు ముందుండాలని కోరుకుంటారు. దీని కోసం రాత్రింబవళ్లు శ్రమించినా మనకు కావాల్సిన డబ్బు సంపాదించడం కష్టం. దీంతో వారు తమ ప్రియమైన వారికి సమయం కేటాయించలేకపోతున్నారు. మన జీవితం సంతోషంగా ముందుకు సాగాలంటే సంతృప్తి అనేది చాలా ముఖ్యమని చాణ్యకుడు చెబుతున్నారు.  మీరు జీవితంలో సంతృప్తిగా ఉంటే, మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండదు. తృప్తి చెందాలంటే ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తృప్తి చెందే వ్యక్తి కంటే సంతోషించే వ్యక్తి మరొకడు లేడు.

3. కరుణ:

మనిషిలో కరుణ చాలా ముఖ్యం. కానీ నేడు, డబ్బు, పేరు సంపాదించాలనే ఈ హడావిడిలో, మనం తరచుగా పేదలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాము. మనపై ఇలాంటి వైఖరి సరికాదని చాణక్యుడు అంటున్నాడు. ఆచార్య చాణక్యుడు తనలో కరుణ ఉన్న వ్యక్తి అత్యంత సంతోషకరమైన వ్యక్తి అని చెప్పారు. ఎందుకంటే దయ అనేది మీ మనస్సులో ఇతర లోపాలు తలెత్తకుండా నిరోధించే లక్షణం.

4. ఆశయం:

చాణక్యుడి నీతి ప్రకారం, దురాశ ఒక శాపం, అది ఒకరి మనస్సులోకి ప్రవేశించిన తర్వాత, అది తప్పుఒప్పులను అవగాహనను మరచిపోయేలా చేస్తుంది. అందుకే ఎప్పుడూ దురాశకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అది మిమ్మల్ని తప్పు మార్గంలో నడిపిస్తుంది.  ఆ తర్వాత మీ ఆనందాన్ని, శాంతిని దూరం చేస్తుంది. మీకు సంతోషకరమైన జీవితం కావాలంటే, దురాశను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ప్రస్తుతం ఉన్నదానితో సంతృప్తి చెందండి అని చాణక్యుడు తన తత్వశాస్త్రంలో చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం, పైన పేర్కొన్న 4 అంశాలను తన జీవితంలో స్వీకరించిన వ్యక్తి శాశ్వతంగా శాంతి, ఆనందంతో జీవిస్తాడు. మీ జీవితంలో శాంతి, సంతోషం కావాలంటే వీటిని స్వీకరించండి.