డాక్టర్లకూ స్వైన్ ఫ్లూ...

 

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినప్పటికీ అదేంటోగానీ స్వైన్ ఫ్లూ తగ్గుముఖం పట్టడం లేదు. సోమవారం నాడు స్వైన్ ఫ్లూతో మరో ఇద్దరు మరణించడంతో అధికారిక లెక్కల ప్రకారమే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. మొత్తమ్మీద జనవరి నెలలో 1050 మంది రోగులకు స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయగా 366 మందికి పాజిటివ్ అని తేలింది. కేవలం ఒక్క సోమవారం నాడే 105 మందికి పరీక్ష చేయగా 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. వీరిలో ఐదుగురు డాక్టర్లు కూడా వుండటం గమనించాల్సిన అంశం. ఇంతకుముందు నలుగురు జూనియర్ డాక్టర్లకు కూడా స్వైన్ ఫ్లూ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్ల పిల్లలకు కూడా స్వైన్ఫ్లూ సోకింది.

Teluguone gnews banner