Read more!

లుకేమియా లక్షణాలు నిర్లక్ష్యం ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు!

లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వస్తే శరీరంలో కొన్ని రకాల సంకేతాలు చూపిస్తుంది. ఎవరికైనా ఇవి సాధారణం కావచ్చు. లుకేమియా ఎలాంటి వ్యాధి అంటే వ్యక్తి లో బోన్ మ్యారో లింఫాటిక్లో బ్లడ్ క్యాన్సర్ ప్రారంభమవుతుంది. ఈ వ్యాధి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే బోన్ మ్యారోలో లుకేమియా కణాలు త్వరగా పెరుగుతాయి. దీనివల్ల శరీరంలోని అవయవాలు అంగాలు తిష్యులో కలిసే ఆక్సిజన్ అందించడంలో సమస్యలు ఎదురౌతాయి. లుకేమియా లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు చాలా సహజంగా సదా సీదాగా ఉంటారు ఏ మాత్రం లక్షణాలు ఉన్నట్లు కనపడరు. ఈలక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రింద పేర్కొన్న కొన్ని లుకేమియా లక్షణాలుకావచ్చు..

అలిసిపోవడం లేదా సుస్తీగా ఉండడం..

మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోయినా తరువాత కూడా మీరు తీవ్రమైన అలసటకు గురియితే మాత్రం దీనికి చాలానే కారణాలు ఉండవచ్చు. డాక్టర్ ను సరైన సమయం లో సంప్రదించి వైద్యపరీక్షలు చేయించడం అలసటకు కారణం తెలుసుకోవం ముఖ్యం. అలసట లుకేమియా లక్షణం కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు.

చర్మం పై నీలపు రంగుల చారలు..

సహజంగా చర్మం పై నీలపు రంగు గుర్తులు దెబ్బతగిలినప్పుడు కనిపిస్తాయి. అలాగే మీ చర్మం పై నీలిరంగు చారాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ఎందుకంటే అది బ్లడ్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. బ్లడ్ ఇన్ఫెక్షన్ కు సంకేతము కావచ్చు.

ఆయాసం గా ఉండడం...

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం. కొద్దిపాటి పనిచేసిన ఆతరువాత మీరు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటె ఇది లుకేమియా లక్షణం కావచ్చు. రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా శరీరం లో పనిచేసే శక్తి తగ్గిపోతుంది . 8 నుండి 1౦ మెట్లు ఎక్కగానే మీరు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి సమస్య తరచుగా ఎదుర్కుంటే మీ సమీపంలోని డాక్టర్ ను సంప్రదించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి.

జ్వరం,చలి మిమ్మల్ని తరచుగా వేదిస్తోందా...

త్గారచుగా మీకు జ్వరం వస్తూ ఉంటె చలివేయడం వంస్తే అది వైరల్ జ్వరంగా భావిస్తారు.ఒక్కోసారి జ్వరం రెండురోజులు చికిత్చ తరువాత తగ్గలేదంటే మీరు మీ డాక్టర్ నుసంప్రదించడం అవసరమైన పరీక్షలు చేయించడం చలివేయడం అంటే లుకేమియా లక్షణంగా చెప్పవచ్చు.

చిగుళ్ళలో వాపులు...

చిగుళ్ళలో వాపులు వస్తున్నాయంటే చాలా మంది దంతసమస్యలు నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ లేదా దంతాలు చిగుళ్ళలో వాపులు వస్తే ఇతర సంకేతాలు వస్తే వెంటనే సత్వరం డాక్టర్ ను సంప్రదించండి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకారి కావచ్చు.