Read more!

ట్రంప్ ను చిక్కుల్లో నెట్టిన 11 ఏళ్ల వీడియో..

 

ఇంతకు ముందు అమెరికా అధ్యక్ష పదవి ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటే కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కే అన్న వార్తలు వినిపించేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎప్పుడూ వివాదాస్ప ద వ్యాఖ్యలు చేసే ట్రంప్ కు.. అవే ప్లస్ పాయింట్ గా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయనకు మైనస్ అవుతున్నాయి. ట్రంప్ కు సాధారణంగా అందరిపై విమర్శలు చేస్తూనే ఉంటాడు. ఆడవాళ్లపై కూడా కామెంట్లు చేస్తూనే ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాల కిందట ఓ మహిళతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. 11 సంవత్సరాల నాటి ఓ వీడియో బయటపడింది. అందులో "అందమైన మహిళలను ముద్దు పెట్టుకోవాలి. ముద్దు మాత్రమే. ముద్దు కోసం నేను ఎంత మాత్రం వేచి చూడను. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరూ ఏమీ అనుకోరు. నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు", ఇలా కొనసాగింది వీడియోలోని సంభాషణ. అంతేకాదు, మహిళల కాళ్లు, వాళ్లతో లైంగిక కార్యకలాపాలు ఇలా ట్రంప్ చేసిన వ్యాఖ్యలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. బిల్లీ బుష్ తో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వీడియోలో ఉంది.

 

ఇంకేముంది ట్రంప్ కు ప్రత్యర్ధిగా ఉన్న హిల్లరీకి మంచి ఛాన్స్ దక్కింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్సలు గుప్పించింది. ఇలాంటి దారుణమైన వ్యక్తిత్వమున్న వ్యక్తిని అధ్యక్షుడిగా మనం అంగీకరించలేం అని ఆమె అన్నారు. ఇంకా చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏం లాభం అన్న సామెత ప్రకారం.. ఇప్పుడు ట్రంప్ కూడా ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఓ ప్రైవేటు సంభాషణ అని... తన మాటలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. ఇప్పటికే మొదటి ప్రెసిడెన్షియల్ భేటీలో మంచి మార్కులు సంపాదించుకున్న హిల్లరీకి... ఇది కూడా ప్లస్ పాయింట్ అయింది. ఈ వీడియో ట్రంప్ విజయవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే నవంబర్ లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల వరకూ ఆగాల్సిందే.