చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు
posted on Sep 22, 2023 @ 1:42PM
స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించిలేదు.
స్కిల్ కేసులో తన ప్రమేయం లేదనీ, తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. దీంతో మరి కొద్ది సేపటిలో ఏసీబీ కోర్టు సీఐడీ కస్టడీ పిటిషన్ పై వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ ను రెండు రోజులు పొడిగించిన నేపథ్యంలో ఆయనను సీఐడీ కస్టడీకి ఇస్తూ తీర్పు వెలువడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్పారు.