కార్యకర్తలకి, నాయకులకీ సెలవులు క్యాన్సిల్: చంద్రబాబు
posted on Apr 24, 2013 @ 8:00PM
మరో మూడు రోజుల్లో తన సుదీర్గ పాదయాత్రను ముగించుకొని ఇంటి ముఖం పట్టనున్న చంద్రబాబు ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో పాదయత్ర చేస్తున్నప్పుడు స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతూ, “ఎన్నికలకు కేవలం ఇంకా ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉన్న ఈ కొద్దిపాటి సమయం మనందరికి చాలా కీలకమయినది. కనుక ప్రతీ కార్యకర్త, ప్రతి నాయకుడు నేటి నుండి పార్టీ కోసం రోజుకు 24 గంటలు పనిచేయవలసి ఉంది. మళ్ళీ ఎన్నికలయ్యే వరకు మీ స్వంత పనులను, బాధ్యతలను మీ కుటుంబంలో వేరే ఎవరికయినా అప్పగించి పార్టీ సేవకే అంకితమయిపోవాలి. అంతవరకు మన పార్టీలో ఎవరికీ కూడా ఇక శెలవులు లేవు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా చేసుకొని మనం అందరూ కలిసి కష్టపడాలి. రాబోయే ఎన్నికలు మన శక్తి, సామర్ద్యాలకి ఒక అగ్నిపరీక్ష వంటివి,” అని అన్నారు.