Read more!

భాగ్యనగరం పై  బీజేపీ న‌జ‌ర్‌!

హైద‌రాబాద్ అనగానే అభివృద్ధిప‌థంలో దూసుకుపోతున్న మ‌హాన‌గ‌రంగానే లోక‌మంతా గుర్తిస్తోంది. ఇది అన్ని రంగాల‌వారికీ, అన్ని వ‌స‌తుల‌తో, త‌గిన వాతావ‌ర‌ణంతో అద్బుతంగా ఆక‌ట్టుకుంటోంది. సామాజిక‌, రాజ‌కీయ‌, పారిశ్రామిక రంగాల్లో గ‌త ముప్ప‌య్యేళ్ల‌లో ఊహించ‌ని స్థాయిని అందుకున్న న‌గ‌రం హైద‌రా బాద్ అనేది అంద‌రూ అంగీక‌రిస్తున్న‌దే. దీనికి తోడు సైబ‌రాబాద్ అంటూ టెక్ న‌గ‌ర భాగం టెక్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీల‌కు అడ్ర‌స్‌గానూ మారి అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌తిష్ట పెంచుకున్న ద‌క్షిణాది ఏకైక న‌గ‌రం హైద‌రాబాద్‌. అందువ‌ల్ల దీన్ని త‌మది చేసుకుని రాజ‌కీయంగా జాతీయ రాజ‌కీయాల్లోనూ పెను మార్పులు తేవాల‌న్న ఆలోచ‌న‌లోనే భార‌తీయ‌జ‌న‌తాపార్టీ ఈ న‌గ‌రం మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతోంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. హైద‌రాబాద్‌ను రెండ‌వ రాజధానిగా చేయ‌డానికి త‌గిన అర్హ‌త‌లున్నాయ‌ని బీజేపీవారు భావించ‌డం అందుకు వ్యూహ‌ర‌చ‌న‌లు చేయ‌డం ఆరంభ‌మ‌యింది. 

ఇటీవ‌లి రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల దృష్ట్యా చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త‌మ ఆధిప‌ త్యం చెలాయించాల‌న్న ఆతృత బీజేపీ వ‌ర్గాలు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. తెలంగాణా విష‌యానికి వ‌స్తే, ఇక్క‌డి ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా రాష్ట్ర రాజ‌కీయాల్లో కంటే కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌న్న ఆలోచ‌న‌లోనే చేస్తున్నారు. కొత్త‌గా జాతీయ‌పార్టీ ఆరంభించి ఎలాగైనా బీజేపీ స‌ర్కార్‌కి  షాక్ ఇవ్వాల‌ని తీవ్ర య‌త్నాలు చేస్తున్నారు. కానీ కాలం ఇంకా ఆయ‌న‌కు క‌లిసిరావ‌డం లేదు. ఆయ‌న కొద్దికాలంగా క‌లుస్తున్న వారంతా ఏదో విధంగా దూర‌మ‌వుతున్నార‌న్న‌ది అనేక సంఘ‌ట‌న‌లే తాజా ఉదాహ‌ర‌ణ‌లు. ఈ కార‌ణంగా ఆయ‌న్ను కాస్తంత దూరం పెట్టి జాతీయ‌స్థాయిలో ఇత‌ర పార్టీల‌వారూ ప్ర‌ధాన విప‌క్షం కాంగ్రెస్‌తో క‌లిసి పోరాడేం దుకు సిద్ధ‌ప‌డ్డాయి. కేసీఆర్ ఆ విధంగా డీలాప‌డ‌టంతో ఇక్క‌డ చ‌క్రం తిప్ప‌డానికి  బీజేపీ సీని య‌ర్లు మ‌రింత ఉత్సాహంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతూ ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అను కూలం చేసుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. కేసీఆర్ దూకుడుకి బ్రేక్ వేయాలంటె హైదరా బాద్ ని  కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలో చనను కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తుంది. తెలంగా ణ ప్రభుత్వం చేతిలో పలు అవమా నాలకు గురి అవుతున్న గవర్నర్ తమిళిసై ఆ దిశగా పావులు కదుపు తున్నారని సమా చారం. దీనికి తోడు కేసీఆర్‌కు దూర‌మ‌యిన  చిన్నజీయరస్వామి కూడా ఈ ప్రతిపాదనను కేంద్ర బీజేపీ పెద్దల చెవిలోవేశారని ప్రచారం జరుగుతున్న‌ది. 

ఈ ఆలోచన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదుకదట చాలా కాలంగా వారి మనసులొఉన్న దాన్ని ఇప్పుడు అమలు చేసేందుకు సిద్దం చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య పరంగా ముంబై తరువాత అంతగా ఎదుగు తున్న ఆధునికనగరంగా హైదరాబాదుకు అంతర్జాతీయంగా పేరొచ్చింది. ఇతర రాష్ట్రాలనుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడాకుటుంబాలతో వలస వచ్చి భాగ్యనగరంలో స్థిరపడడానికి లక్షల మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంవిడిపోయి ఆంధ్ర అనాధగా మారినతరువాత ఆంధ్ర నుండి కూడా వలసలు పెరిగాయి. ఇదే క్రమంలో జనాభా పెరుగుతూ పోయినా మరో పాతికేళ్ళ పాటు మౌలిక వసతులకు ధోకాలేదన్న స్థాయి లో హైదరాబాదు నగరం అభివృద్ధి చెందింది.

ఈ తరుణంలో హైదరా బాదును దేశ రెండవ రాజధాని గా ప్రకటించి ఢిల్లీ, పురుచ్చేరి తరహాలో యూని య న్ టెరిటరీ చేసే ఆలోచనలో కేంద్రపెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ ‘మాస్టర్ స్ట్రోక్'తో కేం ద్రం  పలు ప్రయోజ నాలను ఆశిస్తున్నట్టు తెలిసింది.  తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా కేంద్ర ప్రభుత్వ నేతల దృష్టికి ఈ ఆలోచనను తీసుకె ళ్లినట్టు తెలిసింది. అన్నీ కుదిరితే,హైదరాబాద్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై చరిత్ర సృష్టించవచ్చు కూడా!  విశ్వనగరంగా హైదరాబాద్ రూపొందు తున్న తరుణం లో, దానిపై కేసీఆర్, ఆయన కుటుంబ పెత్తనం లేకుండా చేయడం ఇందులో ప్రధానమై నది. హైద రాబాద్ నుంచి లభించేవనరులు ఆ కుటుంబా నికి అందు బాటు లో లేకుండా చేయడంవారి లక్ష్యం . ఢిల్లీ తరహాలో నగరంలోని శాంతి భద్రతలు, పోలీసింగ్  వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకోవాల న్నది కేంద్రం ఆలోచన, ఆలా చేస్తే ఓల్డ్ సిటీలో మజ్లిస్ పార్టీ రెక్క లు వీలైనంతగాకత్తిరించి వారి ఆధి పత్యానికి బ్రేకులు వేయొచ్చన్నది వారివ్యూహం.

వీటితో పాటు టీఆర్ఎస్ పెత్తనంలో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నతెలుగు చలన చిత్ర సీమను విముక్తి చేయడం, హైదరాబాద్ లోనికీలకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం వంటి పలు ప్రయోజనాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల లోనూ బీజేపీ అనూహ్యంగా బలోపేతం అవుతుందనే ఆశ కేంద్ర పెద్దలలో లేక‌పోలేద‌ని విశ్లేష‌కుల మాట‌. హైదరాబాద్ జనాభాలో 50 శాతానికి మించి స్థానికేతరులు నివసిస్తున్నారు. వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాలకు చెంది నవారు హైదరాబాద్ లో ఇప్పటికే స్థిరపడ్డారు.. ఇంకా స్థిరపడుతున్నారు కూడా.

హైదరాబాద్ లో నివసించే 'స్థానికేతరుల'లో ఎనభై శాతం మంది... ఆంధ్ర ప్రాంతానికి చెందినవారేనని కూడా బీజేపీ అంచనా. తమను టీఆర్ఎస్ నేతలు 'సెటిలర్స్స‌గా సంబోధించడాన్నివారు జీర్ణం చేసుకో లేక పోతున్నారన్నది కమలం పార్టీ నాయకుల అభిప్రాయం.ఈ సంబోధన వల్ల, తాము పెంచి పెద్దచేసిన హైదరాబాద్లో తాము ద్వితీయశ్రేణి పౌరులమ నే భావన వారికి కలుగుతుం దని, ఇలాంటి సమయంలో హైదరాబాద్‌ను  తమ హస్తాల్లోకి తీసుకుంటేఅటు పార్టీకి ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రయోజనం చేకూరుతుందని పార్టీలోని సీనియర్లు సూచిస్తు న్నట్లు సమాచారం.హైదరాబాద్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని మరికొద్దిగా విస్తరించి, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల అక్కడ నివసించే స్థానికేతరులు బీజేపీకి బ్రహ్మరథం పడతారనే అంచనా కూడా కేంద్ర బీజేపీలో ఉంది. తెలంగాణ. తెలంగాణేతర అనే భావనకు అవకాశం ఉండదు.

కాగా,  హైదరాబాద్ పరిధిలో 35 వరకు అసెంబ్లీ స్థానాలు, ఆరులోకసభ స్థానాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్పార్టీ రాజకీయంగా దెబ్బ‌తింటుంద‌న్న‌ అంచనాలో బీజేపీ ముఖ్యులు కొందరు ఉన్నారు. పాత బస్తీ మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లలోనూ ఆంధ్ర 'సెటి లర్స్స గణ నీయంగా ఉన్నారు. అందువల్ల, టీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ ను  'విముక్తి' చేయడంతో పాటు  సీబీఐ, ఐటీ, ఈడీలనుక్రియాశీలం చేస్తే తెలంగాణలో కుటుంబ పెత్తనా నికి చరమగీతం పాడొచ్చని బీజేపీ సీనియ‌ర్ల ఆలోచ‌న‌.