Read more!

బీజేపీ నోటాను బీట్ చేసింది...

రాష్ట్ర విభజతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన జాతీయ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఉనికిని కోల్పోయాయి. 2014లో తెలుగు దేశం, జనసేన పార్టీలతో జట్టు కట్టి పోటీ చేసిన బీజేపీ, 2.2 శాతం ఓట్లతో నాలుగు అసెంబ్లీ, ఒక లోక్ సభ స్థానం గెలుచుకుంది. ఆ విధంగా పొత్తు పుణ్యాన  ఆ మాత్రం ఉనికిని కాపాడుకుంది. కాంగ్రెస్ పార్టీకి 2.8 శాతం ఓట్లు అయితే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. కేవలం ఒకే ఒక్క సీటులో డిపాజిట్ దక్కించుకుని ఉన్నాను అనిపించుకుంది. 

ఇక 2019 కి వచ్చే నాటికి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు తప్పి ఒంటరిగా పోటీ చేయడంతో కమలం ఓటు 0.9 శాటానికి పడిపోయింది. ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ పార్టీ 1.2 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ, నోటాను బీట్ చేసింది. ఈసారి నోటాకు,1.07 శాతం ఓట్లు పోలైతే, బీజేపీకి 2.41 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి పట్టుమని పది కౌన్సిలర్ /కార్పొరేటర్ సీట్లు అయితే రాలేదు కానీ.. నోటాను అయితే దాటేసింది. 

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ప్రకారం 20 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కంటే మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ ఓటు అంత గొప్పగా ఏమీ పెరగలేదు. కానీ టీడీపీ ఓటు గణనీయంగా పడిపోయింది.2019 ఎన్నికలలో వైసీపీకి 50.6శాతం ఓట్లు పోలయ్యాయి, ఈ ఎన్నికలో వైసీపీ ఓటు షేర్ 52.63 శాతానికి పెరింగింది. తెలుగు దేశం ఓటు షేర్ 39.7 శాతం నుంచి 30.63 శాతానికి పడిపోయింది. జనసేన ఓటులో కూడా స్వల్పంగానే అయినా తగ్గింది. జనసేనకు 2019లో 5.6 శాతం ఓట్లు పోలయ్యాయి, ఈసారి అది 4.67 శాతానికి తగ్గింది. మున్సిపల ఎన్నికలలో అధికార వైసీపీ సీట్ల పరంగా ప్రభంజనం సృష్టించింది కానీ.. ఓట్ల పరంగా ఓ రెండు శాతం మాత్రమే గెయిన్ చేసింది.