Read more!

యెడ్డీకి అగ్రనేతల బుజ్జగింపులు

 

సొంతపార్టీమీద అలిగి వేరు కుంపటి పెట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పని బుజ్జగించేందుకు బిజెపి అధిష్ఠానం గట్టిగా ప్రయత్నిస్తోంది. యడ్యూరప్పకి ఎలా నచ్చజెప్పాలో ఆలోచించేందుకు కర్నాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, ఉపముఖ్యమంత్రి అశోక్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఈశ్వరప్ప ఢిల్లీలో ప్రథాన నేతలతో మంతనాలు జరిపారు. గడ్కరీ , రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడుకూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.



తను కొత్తపార్టీ పెట్టుకుంటానన్నాను తప్ప.. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పలేదంటూ యడ్యూరప్ప అధిష్ఠానానికి సున్నితంగా చురకలేస్తున్నారు. పార్టీ ప్రకటన నిర్ణయాన్ని కూడా ప్రస్తుతానికి యెడ్డీ పక్కన పెట్టారు కాబట్టి, ఆయనతో మాట్లాడేందుకు ఇదే మంచి సమయమని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మొత్తానికి యడ్యూరప్ప వేరు కుంపటి బిజెపి అగ్రనేతల్లో కదలికని తీసుకొచ్చిందని కర్నాటక బిజెపి నేతలు అనుకుంటున్నారు.