Read more!

ఆ సత్తా భారత్ కే ఉంది: బిల్ గేట్స్

వ్యాక్సిన్ ఉత్పత్తికి సహాయం చేస్తాం

కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ భారత్ తయారు చేస్తే తాము చేయూత నిస్తామని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకటించారు. ప్రపంచం మొత్తానికి సరిపోయే స్థాయిలోవ్యాక్సిన్ అందించే శక్తి భారతదేశానికి ఉందని ఆయన అన్నారు. భారతదేశంలో ఫార్మారంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 

'కోవిడ్-19: ఇండియాస్ వార్ ఎగనెస్ట్ ది వైరస్' డాక్యుమంటరీ కోసం మాట్లాడుతూ భారత్ పరిశోధనలను ఆయన అభినందించారు. భారత్ లో జరుగుతున్న పరిశోధనలు విజయవంతమైతే కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి ప్రపంచ ప్రజలందరి అవసరాలకు సరిపోయే స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సత్తా భారత్ కు ఉందన్నారు. వ్యాక్సిన్ ను అత్యధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ భారత్ కు సహాయం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

బయో టెక్నాలజీ విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)తో కలసి పని బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కలిసి పనిచేస్తోందన్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయని భారత్ లోనూ బయో ఈ, భారత్ బయోటెక్, సీరమ్ కంపెనీలు పరిశోధనల్లో ప్రగతి సాధించాయన్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని.. అయితే అప్పటివరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బిల్ గేట్స్ సూచించారు.