Read more!

గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదు: బాలకృష్ణ

 

 

హీరో నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశం మొదలు ఆయన ఇక్కడి నుంచి పోటి చేస్తారని, అటు ఆయన అభిమానుల్లో కాకుండా సినీ,రాజకీయవర్గాల్లోనూ పెద్దగా చర్చ ఉండేది. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, నేను ఈ జిల్లా నుంచే పోటి చేస్తానంటూ తెలిపారు. ప్రత్యేకించి ఎ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేదీ త్వరలోనే ప్రకటిస్తానాని బాలయ్య తెలిపారు.


పార్టీ అధినాయకత్వాన్ని ప్రశ్నించే వారిని తాను హెచ్చరిస్తున్నానని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదన్నారు. అధిష్టానంపై ఎవరో కారుకూతలు కూస్తున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే అన్ని రంగాలకు, వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పార్టీ ద్వారా ఎదిగి అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తారా అని నిప్పులు చెరిగారు.



గుడివాడ టిడిపి కంచుకోట అని, ఒకరు వెళ్లిపోయినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు తిరిగి వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించుకునేందుకు పాటుపడాలని కోరారు. పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. టిడిపి గుర్తుతో పదవి పొంది ఇప్పుడు విమర్శిస్తారా అని ఘాటుగా, ఒకింత ఆవేశంతో ప్రశ్నించారు. కొందరు బూటకపు ప్రకటనలతో రైతుల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పార్టీని వీడాలనుకున్న వారు సైలెంట్‌గా వెళ్లి పోవచ్చునని చెప్పారు.