Read more!

రష్యా గబ్బిలాల నుంచి మరో ప్రాణాంతక వైరస్ ఖోస్టా వ్యాప్తి?

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా విముక్తి లభించలేదు. ఇంకా కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మానవాళిపై కరోనా వైరస్ దాడి కొనసాగిస్తూనే ఉంది. అయితే దాని ఉధృతి తగ్గిందనీ, ఇక కరోనా వైరస్ ప్రాణాంతకమెంతమాత్రం కాదనీ వైద్య నిపుణులు, సైంటిస్టులు నిర్ధారంచడంతో ఊపిరి పీల్చుకున్నాం. అయితే అంతలోనే కరోనా కంటే ప్రమాదకరమైన మరో వైరస్ లోకాన్ని చుట్టేసే ప్రమాదం ఉందని శాస్త్ర వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ వైరస్ కూడా గబ్బిలాల నుంచే మనుషులకు వ్యాపిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ సారి ఈ వ్యాప్తికి కారణం చైనా గబ్బిలాలు కావు. రష్యా గబ్బిలాలు. ఖోస్తా-2 గా పిలిచే ఈ వైరస్ రష్యా గబ్బిలాల్లో కనుగొన్నారు. రష్యా గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే ఈ ఖోస్తా-2 వైరస్ కరోనా కంటే ప్రాణాంతకమని హెచ్చరిస్తున్నారు.

యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోట్ల మందిపై ప్రభావం చూపించి లక్షల మందిని బలి తీసుకున్న కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు  ఖోస్తా-2 వైరస్ వ్యాప్తి వార్త నిజంగా  షాకింగే.  రష్యా గబ్బిలాల నుంచి ఖోస్టా 2 వైరస్ మనుషుల్లోకి వ్యాపిస్తున్నట్లు అమెరికా సైంటిస్టులు గుర్తించారు.  ఖోస్టా2 వైరస్ కూడా కరోనా తరహాలోనే ప్రాణాంతకమనీ, ఒక విధంగా చెప్పాలంటే ఇది కరోనా కంటే మరింత ప్రమాదకరమని అంటున్నారు. ఖోస్తా వైరస్ నియంత్రణకు ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లేవీ పని చేయడం లేదని నిర్ధారించారు.