సలహాదారుల చట్టబద్ధతను తేలుస్తాం.. ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వారికి ఇచ్చే జీతభత్యాల సంగతేంటి? వారంతా ఎవరికి.. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఏపీలోని సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది.  జగన్ రెడ్డి సర్కార్ ప‌దుల సంఖ్య‌లో సలహాదారులను నియమించుకుంది. ఆ సంఖ్య 70కి పైనే ఉంటుంది.  

వారిలో చాలా మందికి  మందికి కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చింది.  ఆ హోదాలోనే లక్షల్లో జీత భత్యాలు ఇస్తోంది. అంటే   సలహాదారులకు అందరికీ కలిసి నెల నెలా కోట్ల రూపాయలు జీత భత్యాల రూపంలో ప్రజాధనాన్ని పందేరం చేస్తోంది.   ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు.  సలహాదారుల నియామకంపై ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నా.. న్యాయస్థానం సైతం  ఇంత మంది స‌ల‌హాదారులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా,  విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ సర్కార్ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు  అన్న చందంగా  సలహాదారుల నియామకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత మంది సలహాదారుల నుంచి ఎలాంటి సలహాలు స్వీకరిస్తున్నది ఒక బ్రహ్మ రహస్యం.  

అసలే ఆర్థికంగా దిగజారిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉద్యోగులకుర నెలనెలా సక్రమంగా జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రంలో సలహాదారుల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమిటని ఆర్థిక రంగ నిపుణులు  ప్రశ్నిస్తున్నారు. ఇంత మంది సలహాదారులను నియమించుకున్న జగన్  ప్రభుత్వాన్ని హైకోర్టు కడిగి పారేసింది.

 సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్ గురువారం (జనవరి 5)న హైకోర్టు విచారించింది. ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అంటే వ్యాఖ్యానింది. ఐఏఎస్‌ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని  ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారులకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. 

Teluguone gnews banner