నాన్న యాత్ర పూర్తయ్యేదాకా మాట్లాడను: లోకేష్

 

 

 

 

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 17వ వర్ధంతి కార్యక్రమాలు హైదరరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఉదయాన్నే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించారు. మామా అల్లుళ్లు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ఈ సారి వర్ధంతి కార్యక్రమాలలో కలిసి పాల్గొనడం విశేషం. ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని రసూల్ పుర నుండి మామ బాలకృష్ణతో కలిసి లోకేష్ ప్రారంభించాడు. ఈ సంధర్భంగా మాట్లాడాలని మీడియా కోరగా ”మా నాన్న పాదయాత్ర పూర్తయ్యేదాకా మీడియాతో మాట్లాడను” అని అన్నారు.


తన తాత ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంగా లోకేష్ తను చిన్నప్పుడు తాత ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పెట్టాడు. ఐ మిస్ యూ..అని ట్వీటేశాడు.
 

Teluguone gnews banner