Read more!

జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే! ఎస్ఈసీ నిమ్మగడ్డ మనోగతం

ఆంధ్రప్రదేశ్ లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ సర్కార్ మధ్య వార్ ముదురుతోంది.  నిమ్మగడ్డపై చర్యలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సిద్దమవుతుందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డకు.. మరో రాజ్యాంగ బద్ద కమిటితోనే చెక్ పెట్టే స్కెచ్ సీఎం జగన్ టీమ్  వేసిందని తెలుస్తోంది. అయితే ఏపీ సర్కార్ తాజా పరిణామాలపై తన అనుచరుల దగ్గర స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్..  కీలక, ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, జగన్ సర్కార్ తీరుపై ఆయన తన మనోగతం స్పష్టం చేశారు. 
 
ఎస్ఈసీగా తాను ఎన్నికల వ్యవస్థను కాపాడుతున్నానని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతంలో సహేతుక కారణాలతోనే ఎన్నికలను వాయిదా వేశానని తెలిపారు. పార్టీల పట్ల తనకు పక్షపాతం లేదన్న నిమ్మగడ్డ... తనకు ఎవరితోనూ వ్యక్తిగత వైర్యం లేదన్నారు. వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన అవసరం తనకు అంతకంటే లేదన్నారు. ఎన్నికల వ్యవస్థను కాపాడం కోసం రాజ్యాంగ విధి నిర్వహణలో కమిషనర్ అధికారులను , బాధ్యతను కాపాడం కోసమే  కోర్టులకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు నిమ్మగడ్డ. ఒక వ్యవస్థ, మరో వ్యవస్థలోకి చొరబడటం ప్రజాస్వామ్య వ్సవస్థకు మంచిది కాదన్నారు ఎస్ఈసీ.  భారత రాజ్యాంగ ప్రకారం మూడు వ్యవస్థలు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి, సాకారం, సమన్వయంతో  పని చేయాల్సి ఉందన్నారు. కార్యనిర్వహణ వ్యవస్థతో తలపడాలని తానెప్పుడు  కోరుకోలేదన్నారు. 

రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నందున.. ఆ విధి నిర్వహణలో భాగంగా  ప్రభుత్వ సహకారంతోనే గత ఏడాది ఎన్నికల షెడ్యూల్ విడుల చేశామని నిమ్మగడ్డ అన్నారు. కరోనా తదితర కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందిన్నారు.ఇప్పుడు దేశమంతా పరిస్థితులు మారిపోయాయని,  అనేక చోట్ల స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్  ఉప ఎన్నికలు జరుగుతున్నాయని నిమ్మగడ్డ చెప్పారు. మనకు కూడా గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉండటం కోసమే పంచాయతీ ఎన్నికల నిర్వహిస్తున్నామన్నారు.  రాజ్యాంగ పరిధికి లోబడి.. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తన సన్నిహితులతో చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. 
       
 తాను గవర్నర్ కు రాసిన లేఖలన్ని అధికారకమైనవి, అత్యంత రహ్యస ప్రధానమైనవని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ. ఆ లేఖల అంశాల ఆధారంగా కొన్ని  వ్యూహాత్మక కథనాలను ఆధారంగా చేసుకుని... మంత్రులు హక్కుల తీర్మానం పెడితే భయపడటానికి తానేమి పిరికివాడిని కానని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో గాని, రాజ్యాంగ పరిరక్షణలో గాని ఎలాంటి  విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి తాని సిద్దమని,  అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . తాను ఎవరి హక్కులు హరించలేదని, తన హక్కులను ఎవరైనా  హరించాలనుకుంటే మాత్రం తగిన మూల్సం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వృత్తి పరంగా తప్పు చేయనంత కాలం.. వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించనంత కాలం తాను నిప్పులాంటి మనిషేనని చెప్పారు నిమ్మగడ్డ. 40 సంవత్సరాల వృత్తి జీవితంలో ఏ తప్పు చేయలేదని తన అనుచరులతో ఆయన స్పష్టం చేశారు.. వ్యక్తిగతంగా తానెవరిని దూషించడం లేదని, ఒకవేళ ఎవరైనా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నస్తే మాత్రం భయపడేది లేదని చెప్పారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.