త్వరలో ఎమ్మెల్యే పాషా ఖాద్రీ అరెస్ట్ ?
posted on Jan 22, 2013 @ 11:06AM
ఎంఐఎం పార్టీ నేతలకు వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. మొదట అక్బరుద్దీన్, తర్వాత అసదుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్యే పాషా ఖాద్రీ… మహాత్మ గాంధీ విషయంలో చేసిన అభ్యంతర వ్యాఖ్యానాలపై పాషా ఖాద్రిపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశం ఆదేశించింది. 151, 153(ఏ), 121 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఎల్ బి నగర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఒక సభలో ఖాద్రీ మాట్లాడుతూ… నిజాంలు కట్టించిన అసెంబ్లీ భవన ఆవరణ మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడం ఎందుకని ప్రశ్నించాడు. ఈ మాటలపై ఒక న్యాయవాది వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. మరి ఖాద్రీ అరెస్టు త్వరలోనే ఉండవచ్చు.