శక్తి పీఠం కామాఖ్య దేవాలయం

 

కామాఖ్య టెంపుల్ సీక్రెట్స్. ఈ రోజు ఈ  ఒక చాలా అరుదైన  రహస్యమైన మరియు ప్రత్యేకమైన గుడి గురించి తెలుసుకుందాం. ఇక్కడ జరిగే చిత్రాలని మీరు చూస్తే   చాలా ఆశ్చర్యానికి లోనవుతారు.
అసలు ఆ గుడి ఎందుకంత అరుదైనది మరియు  రహస్యమైనదో తెలుసుకుందాం...

 గోహతీ అస్సాంలోని చాలా  పెద్ద పట్టణం. బ్రహ్మపుత్ర  నది చివరిన ఉన్న ఈ పట్టణం ఎన్నో ప్రకృతి అందాలతో ప్రజల్ని ఆకర్షిస్తుంది . ఎక్కడ ఎన్నో  సంస్కృతి సంప్రదాయాలు మరెన్నో చరిత్రాత్మక కట్టడాలకు  నిలయంగా  మరియు భిన్న భిన్న రాష్ట్రాల వారు ఒకే చోట నివసిస్తున్న కారణంగా ఎంతో పర్యాటక క్షేత్రంగా మారింది. ఈ పట్టణం ముఖ్యంగా కామాఖ్య టెంపుల్ వల్ల ప్రసిద్ధిగాంచింది ఇక్కడికి వచ్చినవారు కామాఖ్య మందిరాన్ని దర్శించినట్టయితే వాళ్ల యాత్ర పూర్తి కానట్టే అని భావిస్తారు. ఎంతోమంది ఇక్కడ జరిగిన అద్భుతాల గురించి పుస్తకాల్లో కూడా వివరిస్తూ ఉంటారు మరియు ఎన్నో సంఘటనలు  ఈ మందిరం యొక్క దేవిక శక్తి గురించి ఆధారాలను చూపెడుతుంది. ఈ మందిరంలో దేవి కామాఖ్య ఆలయంతోపాటు కాళీ మాత యొక్క పది అవతారాల దర్శనమిస్తాయి.
అయితే  మందిరం యొక్క ప్రత్యేకతల అక్కడ జరిగే అద్భుతాలు   గురించి తెలుసుకుందాం 
 ఇక్కడ భక్తులు చెప్పేదేంటంటే దేవి మాత ఆలయం లో తెల్లటి గుడ్డలను ఉంచుతారు అయితే మూడు రోజుల తర్వాత తడిచి గుడ్డ ఎర్రగా మారుతుంది దీనికి కారణం దేవి రజస్వల అవుతుందని అంటారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ కానీ ఇది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకా చాలానే ఉన్నాయి.

2. ఈ మందిరంలో దేవి శక్తి కి ఎటువంటి మూర్తి అనేది లేదు. మీరు అనుకోవచ్చు మందిరంలో మూర్తి లేనిది మరి పూజలు ఎలా జరుపుతారు అని. ఇక్కడ మీకు టెంపుల్ లో విగ్రహం యోని రూపంలో ఉంటుంది. ఇది దేవి శక్తి యొక్క యోని రూపం. 

3. చాలా మహత్తరమైన శక్తి పీఠం. ఇది మొత్తం 108 శక్తి పీఠాలలో ప్రధాన 18 మహా శక్తి పీఠాలలో ఒకటి కామాఖ్యా ఆలయం మొత్తం 108 శక్తి పీఠాలలో పురాతన ఆలయాలలో ఒకటి, దీని మూలం 8 వ శతాబ్దం నాటిది. దీనిని 16 వ శతాబ్దంలో కూచ్ బెహార్ రాజు నర నారాయణ పునర్నిర్మించారు. రుద్రా సింఘ పెద్ద కుమారుడు సిబా సింఘా నియంత్రణ మరియు పునర్నిర్మాణాన్ని మహాంత్ కృష్ణారామ్ భట్టాచార్యకు బదిలీ చేసినప్పటి నుండి ఇది మరలా కొన్ని సార్లు పునరుద్ధరించబడింది.  ప్రధాన ఆలయంతో పాటు చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి.

ఆలయ దేవత గౌహతిలోని నీలాచల్ కొండపై ఉన్న కామాఖ్యా దేవిని ‘రక్తస్రావం చేసే దేవత’ గా గౌరవిస్తారు.

ఆలయం యొక్క ‘గర్వాగ్రిహా’ లేదా గర్భగుడి హిందూ దేవత శక్తి యొక్క పౌరాణిక గర్భం మరియు యోనిని కలిగి ఉందని నమ్ముతారు.

ఆసక్తికరంగా, ప్రతి సంవత్సరం ఆశాద్ (జూన్) నెలలో, కామాఖ్యకు సమీపంలో ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుంది. ఈ కాలంలో దేవత ‘రుతుస్రావం’ అవుతుందని నమ్ముతారు.

రుతుస్రావ సమయంలో గుడిని మూసివేస్తారు...

దేవి యొక్క మూడురోజుల బహిష్టు సమయంలో ఈ గుడిని మూసే ఉంచుతారు అంతేకాకుండా ఎర్రగా మారిన బ్రహ్మపుత్ర నది నీళ్లను ప్రసాదంగా పంచుతారు. అయితే ఇందుకు సరైన ఆధారం ఏది లేదు. ఇక్కడ పూజారులే నదిలో ఎరుపురంగు కలుపుతారని అందరూ అనుకుంటారు. వాళ్లు నదిలో సింధూరం కలపడం వల్ల అది ఎరుపు రంగులో మారుతుంది అని కొందరు భావిస్తారు

16వ శతాబ్దం లో ఈ గుడిని ధ్వంసం చేశారట మళ్లీ నారాయణ అనే రాజు దీనిని పునర్నిర్మించారు.

తేనెటీగలు తుట్టలాగా గోపురం ఉంటుంది. 

ఈ గుడి ఒక గోపురాన్ని గమనించినట్లయితే, ఇది తేనె పట్టు లాగా అనిపిస్తుంది. ఒక వినాయకుడి విగ్రహం తప్పించి హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క దేవి దేవతల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి


 స్త్రీ యొక్క పునః సృష్టికి ప్రతిరూపం...

 పురాణాల ప్రకారం ఈ ఆలయం ప్రతి స్త్రీకి సంతానోత్పత్తి శక్తిని సూచిస్తుంది. కోపంతో ఉన్న శివుడిని శాంతింపచేయడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు సతీ యోని లేదా ‘యోని’ మరియు ‘గర్భం’ ఈ ప్రాంతంపై పడ్డాయని చెబుతారు. దేవత యొక్క ఈ రెండు భాగాలు ప్రతి స్త్రీ కలిగి ఉన్న కొత్త జీవితాన్ని సృష్టించే శక్తి యొక్క ప్రతీకగా నిలుస్తాయి.

అలాగే, భగవంతుడు శివునితో సన్నిహితంగా కలుసుకునే ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి మరియు అది కూడా కొత్త జీవితం ప్రారంభానికి సంకేతం. 

తాంత్రిక విద్యలకు కేరాఫ్ అడ్రస్...

కామాఖ్యా ఆలయం తాంత్రిక అభ్యాసాల కోసం శక్తి పీఠాల యొక్క ప్రధాన ప్రదేశాలలో ఒకటి, దాని ప్రత్యేకమైన నిర్మాణంతో, నిగూడమైన ఇంకా అందమైన వాతావరణం తాంత్రికులను ఆకర్షించింది.

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories