వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

  ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.  చాలా స్పష్టంగా పెళ్లికి ముందు పెళ్ళి తర్వాత అని చెబుతుంటారు కొందరు. ఇది కేవలం జీవనశైలి గురించి మాత్రమే కాదు..ఆరోగ్యం, శరీరాకృతి గురించి కూడా. ముఖ్యంగా అమ్మాయిలను గమనిస్తే పెళ్ళికి ముందు సన్నగా, నాజూగ్గా ఉన్నవారు కాస్తా పెళ్లి తర్వాత లావుగా బొద్దుగా మారిపోతుంటారు. నిజానికి దీని వల్ల చాలామంది కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పెళ్లి తర్వాత అమ్మాయిలు లావు కావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పెళ్ళి నిశ్చయం అయినప్పటి నుండి పెళ్లి తంతు ముగిసిన భర్తతో కొత్త జీవితం మొదలు పెట్టడం వరకు అమ్మాయిల ఆహార  విధానాలు మొత్తం మారిపోతాయి. ఇక కొత్తగా పెళ్లైన జంట బయటకు వెళ్లడం. ఇద్దరూ కలసి సరదా కోసం ఆహారం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా అమ్మాయిల ఆహారంలో కేలరీలు బాగా పెరుగుతాయి. ఇదే వారు లావు అవ్వడానికి కారణం అవుతుంది. ఆహార విధానం మారినా కొందరు బరువు పెరుగుతారు. పెళ్లయి అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయిలు అక్కడి ఆహారపు అలవాట్లు. వంట విధానం, తినే వేళలు ఇలా ప్రతి విషయంలో మార్పులు ఎదుర్కుంటారు. ఈ కారణంగా  జీర్ణక్రియ కూడా మార్పులు చోటు చేసుకుంటుంది. కొత్త పద్దతికి జీర్ణ క్రియకు అలవాటు పడేవరకు బరువు పెరగడం కామన్. భార్యాభర్తలు కలిసి భోజనం చేయడం అనేది కొత్తజంటకు కామన్. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం,  కొత్త కొత్త వంటకాలు ట్రై చేయడం, భోజనంలో కాస్త ప్రత్యేక వంటకాలు ఉండేలా చూసుకోవడం వంటి కారణాల వల్ల సాధారణం కంటే ఎక్కువ తింటూంటారు. ఇది కూడా అమ్మాయిలు బరువు పెరగడానికి కారణం అవుతుంది.                                             *నిశ్శబ్ద.


పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

వేసవికాలంలో చెమట పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి!   ప్రతి సీజన్ ప్రజలకు ఇష్టమైనవి, ఇష్టం లేనివి అంటూ కొన్ని మార్పులను వెంటబెట్టుకొస్తుంది. వేసవిలో మామిడిపండ్లు, తాటిముంజలు, ఆవకాయ వంటి రుచులే కాకుండా భగభగ మండే ఎండలు, ఈ ఎండల ధాటికి ఎదురయ్యే చెమట, చెమట వెంట చెమటకాయలు, నలుగురిలో అసౌకర్యం వంటి చికాకు పెట్టే సంఘటనలు కూడా ఉంటాయి. సాధారణంగా అబ్బాయిలను మాత్రమే వేధించే అతి చెమట సమస్య వేసవి కాలంలో అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా చెమట కారణంగా అమ్మాయిల ముఖం కాంతిని కోల్పోవడమే కాదు.. మొటిమలకు, దురదలకు, చర్మం కందిపోవడానికి కారణం అవుతుంది.  అయితే కింది ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే వేసవి కాలంలో చర్మం తాజాగా ఉండటమే కాదు..  చెమట పట్టకుండా కూడా ఉంటుంది.  వేసవిలో అమ్మాయిలు ట్రై చెయ్యాల్సిన ఫేస్ ప్యాక్ లు ఏంటో ఓ లుక్కేస్తే.. పెరుగు, అలోవెరా ప్యాక్.. సూర్యరశ్మికి గురికావడం వల్ల  ముఖం కాంతిని కోల్పోయి  నిర్జీవంగా ఉంటుంది. దీనికి పెరుగు, కలబంద ప్యాక్ బెస్ట్ ట్రీట్మెంట్.   ఈ ప్యాక్ ముఖాన్ని  చల్లగా తాజాగా ఉంచడంలో సహాయపడతుంది. ఒక గిన్నెలో ఒక చెంచా పెరుగు,  మూడు చెంచాల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ  మిశ్రమాన్ని  ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ముల్తానీ మట్టి,  పుదీనా ఫేస్ మాస్క్.. పుదీనా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.   ముల్తానీ మట్టి అదనపు నూనెను క్లియర్ చేస్తుంది.  ఈ మాస్క్ వేసుకుంటే ముఖ చర్మం మంటను తగ్గించుకోవచ్చు.  ఎండవేడి నుండి  ముఖాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఒక గిన్నెలో 1 టీస్పూన్  పుదీనా పొడి లేదా పుదీనా పేస్ట్..  2 టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టిని కలపాలి. అవసరమైతే దీనికి  కొన్ని చుక్కల నీటిని జోడించవచ్చు,  ఈ పేస్ట్ ను ముఖం,  మెడకు  అప్లై చేసిన తర్వాత అది ఆరిపోయే వరకు వెయిట్ చెయ్యాలి. అనంతరం సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. టమోటా, తేనె ఫేస్ మాస్క్.. ఒక గిన్నెలో ఒక మీడియం సైజ్ టొమాటో  గుజ్జు..  ఒక చెంచా తేనె కలపాలి.  ముఖానికి అప్లై చేసిన తర్వాత  20 నిమిషాలు అలాగే ఉంచాలి.  తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డుగల లేదా మోటిమలు వచ్చే చర్మానికి తేనెలోని యాంటీ బాక్టీరియల్   లక్షణాలు అద్భుతంగా పనిచేస్తాయి. మరోవైపు టొమాటోలు టానింగ్‌ను నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. వేసవిలో ఈ రెండింటి కలయిక మంచి ఫలితాలు ఇస్తుంది.   రోజ్ వాటర్, చందనం ఫేస్ మాస్క్.. వేసవికాలంలో వచ్చే మొటిమలు,  ముఖ చర్మంలో  అసౌకర్యానికి గంధం  ఎప్పటినుండో అందుబాటులో ఉన్న చిట్కా. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది.  అదనపు నూనెను, చర్మంలో ఉండే డస్ట్ ను తొలగిస్తుంది.   చర్మం  మెరుపును మెరుగుపరుస్తుంది.  2 టీస్పూన్ల స్వచ్ఛమైన గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలపాలి. ఈ పేస్ట్ ను  ముఖంపై  అప్లై చెయ్యాలి.  ఆరిన తరువాత సాధారణ నీటితో ముఖం కడుక్కోవాలి. పుచ్చకాయ, పెరుగు ఫేస్ మాస్క్.. ముఖానికి అవసరమైన  విటమిన్ ఎ,  సి పుచ్చకాయలో లభిస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరుపును ఇస్తుంది. జిడ్డుగల చర్మానికి ఇది మంచి ఎంపిక. ఒక గిన్నెలో 1 టీస్పూన్ పెరుగు,   పుచ్చకాయ గుజ్జు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేయాలి. టాన్ ఉన్న  ప్రాంతాలలో కాస్త మందం పొర వేసుకోవాలి.  పది నుండి పదిహేను నిమిషాల తర్వాత  ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్‌ని ఉపయోగించిన తర్వాత సన్‌బర్న్ అయిన ప్రాంతాలు ఉపశమనం పొందుతాయి.                                            *రూపశ్రీ.