మడోన్నా సంచలనం.. జుట్టే ఆచ్ఛాదనం!
on Apr 3, 2021
పాప్ సింగర్, యాక్ట్రెస్ మడోన్నాకు వయసనేది కేవలం నంబర్ మాత్రమే. తన లేటెస్ట్ బ్రాండ్ న్యూ ఫొటోస్‌లో ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది మడోన్నా. అయితే చెస్ట్‌ను తన పొడవాటి హెయిర్‌తో కవర్ చేసుకోవడం ఈ ఫొటోల్లోని విశేషం. ఆ ఫొటోల్లో మడోన్నాను చూసిన వాళ్లెవరైనా ఆమె వయసు 62 ఏళ్లంటే నమ్మరు కాక నమ్మరు.
'ఎక్స్‌ప్రెస్ యువర్సెల్ఫ్' సాంగ్‌తో మరోసారి తన అభిమానులను ఉర్రూతలూగించిన మడోన్నా ఏప్రిల్ 2న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. ఆ ఫొటోల్లో తన చెస్ట్‌ను ఆమె పొడవాటి జుట్టుతో కప్పేసుకుంది. ఆమె ముఖంలో వెతుకుదామన్నా ఒక్క మచ్చ కనిపించడం లేదు. వైట్ హెయిర్, బ్లూ ఐస్, నున్నటి స్కిన్‌తో బ్యూటిఫుల్‌గా కనిపిస్తోందామె. ఆమె వెనుక పలు ఆరంజ్ ల్యాంప్స్ వెలుగుతున్నాయి.
మొదటి రెండు ఫొటోల్లో ఈ పాప్ ఐకాన్ తన బ్లూ ఐస్‌తో పైకి చూస్తూ కనిపిస్తోంది. ఆ ఫొటోలను చూస్తే ఆమె వయసు 62 కాదు, 22 అంటే నమ్మేసేటట్లే ఉంది. రెండో ఫొటోలో ఆమె వక్షస్థలం కొంచె ఎక్స్పోజ్ అవుతున్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ 'నో న్యూడిటీ' పాలసీకి అనుగుణంగానే అది ఉంది. మడోన్నా ధరించిందల్లా మెడకు కొన్ని నెక్లెస్‌లు, పెండెంట్లు మాత్రమే. ఆ ఫొటోలకు “Why do I have to Explain Everything……..” అనే క్యాప్షన్ జోడించింది ఈ పాప్ గాడెస్. ఇంకేమంటాం ఆమెను!!
Also Read