ఇంటి దోషమే 'అఖిల్'కి దెబ్బేసిందా?
on Feb 8, 2016

సినిమా వాళ్లకుసెంటిమెంట్లు ఎక్కువ. ఏదైనా ఓ విషయాన్ని బలంగా నమ్మితే... ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సెంటిమెంట్‌కి అనుగుణంగా నడుచుకొంటుంటారు. వినాయక్‌కీ సెంటిమెంట్లపై చాలా గురి. ఆయన తన ప్రతీ సినిమా విడుదల ముందు అంతర్వేది వెళ్లి, లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో పూజలు చేయిస్తుంటారు. పాటల క్యాసెట్లో, పోస్టరో ఆయన పాదాల దగ్గర పెడుతుంటారు. `అఖిల్` ఫ్లాప్‌తో వినాయక్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. దర్శకుడిగా ఆయన మైలేజీ కొంచెం తగ్గింది. అప్పుల పాలైన బయ్యర్లనూ ఆదుకోవాల్సిన బాధ్యత ఆయనపై పడింది. దాదాపు రూ.5 కోట్ల వరకూ వినాయక్ తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సివచ్చింది. దీనంతటికీ కారణం సెంటిమెంటే అని ఆయన నమ్మకం. ఇటీవల ఆయన జూబ్లీహిల్స్ ఏరియాలో విలాసవంతమైన ఇల్లు కట్టుకొన్నారు. ఆ ఇంట్లోకి వెళ్లాకే.. అఖిల్ సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఆ ఇంటికి వాస్తు దోషం ఉందనే విషయాన్ని వినాయక్ ఇటీవలే పసిగట్టారు. ఈమధ్య తన బ్యాడ్ టైమ్‌కీ ఆ ఇల్లే కారణమని ఆయన విశ్వాసం. అందుకే ఉన్నఫళంగా ఆ ఇంటిని బేరం పెట్టేశారు. 20 కోట్లకు అమ్మేశారు. వినాయక్ అప్పుల పాలైపోయాడని, అందుకే ఇంటికి అమ్ముకొన్నారని గుసగుసలు వినిపిస్తున్నా.. ఆ ఇంటి అమ్మకం వెనుక అసలుకారణం ఇదన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు సొంతూరులో ఉన్న వీమాక్స్ థియేటర్‌ని కూడా బేరానికి పెట్టేశాడట. ఆ ధియేటర్ అమ్మి, మధురవాడలో మరో థియేటర్ కొనడానికి వినాయక్ సిద్ధమవుతున్నాడని టాక్. మొత్తానికి ఇంట్లోని దోషమే అఖిల్ సినిమా ఫ్లాప్‌కి కారణమన్నమాట. ఏంటో.. ఎవరి నమ్మకాలు వాళ్లవి. కాదనడానికి మనం ఎవరం?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



