English | Telugu

"విజేత" మూవీ రివ్యూ

on Jul 12, 2018

నటీనటులు: కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, మురళీ శర్మ తదితరులు..        

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్                                  
కెమెరా:  కె.కె.సెంథిల్ కుమార్                        
నిర్మాత: రజని కొర్రపాటి                             
దర్శకత్వం: రాకేష్ శశి                               
విడుదల తేదీ: 12/07/2018

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను రెండో పెళ్లి చేసుకోవడంతో.. మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీతోపాటు హీరోగా ఛాన్స్ కూడా కొట్టిన కళ్యాణ్ దేవ్ నటించిన చిత్రం "విజేత". తండ్రీకొడుకుల నడుమ ప్రేమానుభూతుల నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాకేష్ శశి దర్శకుడిగా పరిచయమయ్యాడు. మరి ఈ సినిమా విజేత బాక్సాఫీస్ వద్ద గెలిచాడా లేక ఢీలాపడ్డాడా అనేది రివ్యూ చదివి తెలుసుకోండి.

కథ:

ఫోటోగ్రాఫర్ గా విజయ శిఖరాలు అందుకోవాలన్న తన ఆశయాన్ని కుటుంబం కోసం పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తుంటాడు శ్రీనివాస్ (మురళీ శర్మ). కొడుకంటే శ్రీనివాస్ కి ప్రాణం తనకి ఉన్నంతలో కొడుకుని జాగ్రత్తగా పెంచడమే కాక తన స్థాయికి మించినా కూడా కొడుకు అవసరాలు తీరుస్తుంటాడు. కానీ.. తండ్రి పడే కష్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆవారాగా తిరుగుతుంటాడు కొడుకు రామ్ (కళ్యాణ్ దేవ్). ఆ సమయంలో పరిచయమవుతుంది చైత్ర (మాళవిక నాయర్). ఇంటి ఎదురమ్మాయి కావడంతో ఆమెను ఇంప్రెస్ చేయడానికి నానా హడావుడి చేస్తుంటాడు రామ్. అయితే.. కొడుకు జులాయిగా తిరుగుతుండడం పట్ల మనసులో బాధపడుతూనే ఉంటాడు శ్రీనివాస్. ఆ బాధ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. దాంతో రామ్ ఆలోచనలోనూ మార్పు వచ్చి.. బుద్ధిమంతుడిలా మారుతాడు.

పాజిటివ్స్:

మురళీ శర్మ నటన
సెంథిల్ సినిమాటోగ్రఫీ
ప్రొడక్షన్ వేల్యూస్

నెగిటివ్స్:

కళ్యాణ్ దేవ్
రొటీన్ కథ-కథనం
కొత్తదనం లేకపోవడం

ఎనాలసిస్:

దర్శకుడు రాకేష్ శశి రాసుకొన్న కథ బాగుంది కానీ.. ఆ కథను నడిపిన కథనం మాత్రం బాలేదు. కొత్తదనం కొసమెరుపుగానైనా ఎక్కడా కనిపించదు. అవే పాత ఎమోషన్స్, అవే పాత సన్నివేశాలు తప్ప సినిమాలో ఎక్కడా ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే అంశం ఒక్కటి కూడా కనిపించదు. అందువల్ల సినిమా మొత్తంలో ప్రేక్షకుడు ఎక్కడా పెద్ద ఎగ్జైట్ అవ్వడు. ఆ కారణంగా రాకేష్ దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

నటీనటులు:

ఏదో చిరంజీవి అల్లుడు, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో అని భరించడం తప్ప కుర్రాడి ముఖంలో కళ, ఎక్స్ ప్రెషన్ అనేవి ఏ మూలనా కనిపించలేదు. ఆఖరికి అల్లు శిరీష్ ఈ సినిమా చేసినా బాగుండేది కదా అని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు అనుకొనే రీతిలో సినిమాలో మనోడి నటన ఉండడం గమనార్హం. పాపం మాళవిక నాయర్ కి పెద్దగా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించకపోయినప్పటికీ.. కమర్షియల్ హీరోయిన్ లా ఏదో పాటకి పరిమితం అవ్వకుండా తన స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకొంది. మురళీ శర్మ ఈ సినిమాకి నిజమైన కథానాయకుడు. కథ కూడా ఆయన చుట్టూనే తిరుగుతుంటుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు తన తండ్రిని తలచుకొనేలా ఉంటుంది ఆయన పాత్ర, ఆ పాత్రను ఆయన పోషించిన తీరు.

సాంకేతిక విలువలు:

హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బాణీలు బాగున్నాయి. నేపధ్యం సంగీతం కూడా కంటెంట్ కి తగ్గట్లుగా ఉంది. సెంథిల్ స్థాయి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అవసరం లేకపోయినా.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సినిమా ఎలా ఉందంటే!

ఫ్యామిలీ ఆడియన్స్ తప్ప రెగ్యులర్ సినిమా గోయర్స్ సినిమాకి ఎంజాయ్ చేయలేరు.

తెలుగు ఒన్ ప్రోస్పెక్టివ్:

రొటీన్ ఫార్ములా ఫ్యామిలీ డ్రామా

రేటింగ్: 1.5/5


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here