రౌడీ హీరో.. సాలా క్రాస్ బ్రీడ్!
on Jan 18, 2021
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతోన్న చిత్రానికి 'లైగర్' అనే టైటిల్ ఖరారు చేశారు. "సాలా క్రాస్‌బ్రీడ్" అనేది ట్యాగ్‌లైన్. లయన్, టైగర్ సంయోగంతో పుట్టిన మృగాన్ని లైగర్ అంటారనే విషయం ఇక్కడ గమనార్హం. 'లైగర్' మూవీతో విజయ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌తో కలిసి కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. విజయ్ జోడీగా బాలీవుడ్ తార అనన్యా పాండే (చంకీ పాండే కుమార్తె) నటిస్తోంది.
సోమవారం 'లైగర్' మూవీ టైటిల్‌ను ప్రకటించిన నిర్మాతలు, టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఉంగరాలు తిరిగిన పొడవాటి జుట్టు, చేతికి రెడ్ కలర్ గ్లౌవ్స్‌తో కిక్ బాక్సర్‌లా కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్లో సింహం, పులి రూపాలు కనిపిస్తున్నాయి.
ఈ పోస్టర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన విజయ్, "మా పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'లైగర్'ను సగౌరవంగా ప్రకటిస్తున్నాం. నేషన్ వైడ్ మ్యాడ్నెస్ గ్యారెంటీడ్." అని రాసుకొచ్చాడు.
తన హీరోలను పూర్తిగా భిన్నమైన అవతారాలలో చూపించే పూరి జగన్నాథ్, ఇప్పుడు టైటిల్ రోల్లో విజయ్ దేవరకొండను ఇంతవరకూ చూడని డిఫరెంట్ లుక్‌తో చూపిస్తున్నాడు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ తల్లిగా రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలు.