హాస్పటల్‌లో విజయ్ దేవరకొండ
on Mar 22, 2019
యావత్ భారతదేశంలో మెజార్టీ ప్రజలందరూ గురువారం హోలీ సంబరాల్లో మునిగి తేలారు. కొందరు ఎన్నికల హడావిడిలో ఉన్నారు. విజయ్ దేవరకొండ మాత్రం హాస్పటల్‌లో ఉన్నాడు. ట్రీట్మెంట్ తీసుకోవడంలో బిజీ బిజీ. రౌడీ అలియాస్ అర్జున్‌రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ హీరోకి ఏం కాలేదు. హై ఫీవర్ వచ్చింది... అంతే! ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి... 'డియర్ కామ్రేడ్'. మరొకటి... క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నది. రాత్రి పగలు తేడా లేకుండా బుధవారం అంతా రెండు సినిమాల షూటింగుల్లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ. దాంతో బాగా నీరసించిపోయాడు. దీనికి తోడు ఫీవర్ వచ్చింది. ఆలస్యం చేయకుండా హాస్పటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఫీవర్ తగ్గిన తరవాత రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ షూటింగులకు హాజరు కానున్నాడు. ఇటీవల విడుదలైన 'డియర్ కామ్రేడ్' టీజర్ విజయ్ దేవరకొండ అభిమానులకు బాగా నచ్చింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 31న విడుదల కానుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
