English | Telugu

'ఎఫ్2' మాదిరే 'వెంకీ మామ' కూడా ఇరగదీసేట్లే ఉన్నాడు!

on Oct 9, 2019

 

నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య అవే తరహా పాత్రల్ని పోషిస్తోన్న సినిమా 'వెంకీ మామ'. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి 'ఫస్ట్ గ్లింప్స్' పేరుతో విడుదలైన వీడియో యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అయ్యింది. దీన్నిబట్టే ఈ చిన్న వీడియో ఎంత ఆదరణ పొందిందీ అర్థం చేసుకోవచ్చు. కేవలం 38 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో వెంకీ, చైతూ మాత్రమే కనిపించారు. వాళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ సూపర్‌గా పండినట్లు ఆ కొద్ది క్షణాల క్లిప్‌లోనే మనకు అర్థమైపోతోంది.

వెంకీకి జోడీగా చేస్తోన్న పాయల్ రాజ్‌పుత్ కానీ, చైతూ సరసన నటిస్తోన్న రాశీ ఖన్నా కానీ ఈ గ్లింప్స్‌లో కనిపించలేదు. అలాగే విలన్ కానీ, మిగతా ప్రధాన పాత్రధారులెవరూ ఈ వీడియోలో చోటు దక్కించుకోలేకపోయారు. అంతేనా.. చైతూ కనిపించినా.. తను ఒక్క మాటా మాట్లాడలేదు. ఉన్న రెండు డైలాగులూ వెంకీ నోటి నుంచే వచ్చాయి. అయితేనేం.. ఆ డైలాగులే కొంత కథనూ, క్యారెక్టర్ల తీరునూ తెలియజేస్తున్నాయి.

ఈ సినిమాని దివంగత నిర్మాత, మూవీ మొఘల్‌గా పేరుగాంచిన డి. రామానాయుడుకు అంకితమిస్తున్నట్లు ఈ వీడియో ప్రారంభంలో చూపించారు. 'జై జవాన్ జై కిసాన్' అనే మాటల్ని బట్టి ఈ సినిమాలో జవాన్, కిసాన్.. ఇద్దరూ ఉంటారని, ఇది వాళ్లిద్దరి కథా అనీ ఊహించవచ్చు. 'వెంకీ మామ' కథలో జవాన్‌గా నాగచైతన్య, కిసాన్‌గా వెంకటేశ్ కనిపిస్తారు. ఆర్మీలో పనిచేస్తున్న చైతూ తన మేనమామ ఊరికి వస్తాడనీ, అప్పుడు అతనికి వెంకీమామ ఊరి పొలాలు, అక్కడి పరిస్థితులూ పరిచయం చేస్తాడనీ తెలుస్తోంది.

అక్కడి వ్యాయామశాలలో మేనల్లుడితో కసరత్తులు చేయిస్తాడు. "గోదావరిలో ఈత నేర్పా.. బరిలో ఆటనేర్పా.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడూ" అంటూ జాతరలో చైతూతో కలిసి తమతో గొడవకు వచ్చినవాళ్లను చితగ్గొట్టాడు. ఆ మాటల్ని బట్టి మేనల్లుడికి వెంకీమామ చాలానే నేర్పించినట్లు కనిపిస్తోంది.

"ఏమంటుందిరా.. ఇందాకట్నుంచీ ప్రాక్టీస్ చేస్తుంటీ.. 'ఐలవ్యూ.. ఐలవ్యూ.. ఐలవ్యూ ఐలవ్యూ అనేసిందిరా అల్లుడూ" అని ఎగ్జైట్ అయిపోతూ చైతూని వాటేసుకున్నాడు వెంకీ. అతని మాటల్లో 'ఐలవ్యూ' అన్నది బహుశా పాయల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పటి దాకా వెంకీకి కూడా పెళ్లి కాలేదన్న మాట. వెంకీతో పాటు చైతూ కూడా ఎగ్జైట్ అవడాన్ని బట్టి మేనమామనీ, పాయల్‌నీ కలపడానికి అతను ప్రయత్నిస్తున్నాడనీ, అది సక్సెస్ అవుతున్నదనే ఆనందంతోనే అతను కూడా ఎగ్జైట్ అయ్యాడనీ అనిపిస్తుంది.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here