'మోసగాళ్లు'కు వెంకటేశ్ వాయిస్ ఓవర్!
on Oct 15, 2020
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విష్ణు మంచు నటిస్తోన్న హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ 'మోసగాళ్లు' ఒకటి. ఇది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న క్రాస్-ఓవర్ ఫిల్మ్. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానున్నది. 'మోసగాళ్లు' చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివరకెన్నడూ లేని విధంగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ రిలీజ్ చేసిన టీజర్‌కు అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పారు.
కాగా ఆసక్తికరమైన అప్‌డేట్ ఏమంటే.. ఇదివరకు 'మోసగాళ్లు' టైటిల్ కీ థీమ్ మ్యూజిక్‌ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు తన వాయిస్ ఓవర్‌ను ఈ చిత్రానికి అందిస్తుండటం. ఈ సినిమా స్టోరీని ప్రారంభం నుంచి ముగింపు దాకా ఆయన నెరేట్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఓ స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ ఇప్పించాలని నిర్మాతలు భావించారు. తనను సంప్రదించిన వెంటనే వెంకటేష్ ఆనందంగా అందుకు అంగీకరించారు. టీజర్ రిలీజ్ అయినప్పట్నుంచీ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది మరింత ఆకర్షణను తీసుకు రానున్నది.
జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ కనిపించనుండటం ఓ విశేషం. విష్ణు జోడీగా రుహీ సింగ్ కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
